ఐపీఎల్‌లో తొలి విజయం సాధించిన సన్‌రైజర్స్ అదే జోరు కొనసాగించేందుకు సిద్ధం అవుతోంది. మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను చివరి ఓవర్లో ఓడించిన కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా సన్‌రైజర్స్‌ను చిత్తు చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ బ్యాటింగ్‌పై ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ జట్టులో అందరూ కుడి చేతి వాటం బ్యాటర్లే ఉన్నారని ఎత్తిచూపాడు.
'ఈ టీం బ్యాటింగ్‌లో చాలా డెప్త్ ఉంది. అలాగే ఖరీదైన హ్యారీ బ్రూక్ కూడా ఉన్నాడు. కానీ అతను తన సత్తా చాటలేదు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తెల్లమొఖం వేస్తున్నాడీ టాప్ ప్లేయర్' అని ఆకాష్ చోప్రా వివరించాడు. అదే సమయంలో స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా అంత గొప్ప ఇన్నింగ్స్ ఆడలేదని గుర్తుచేశాడు. రాహుల్ త్రిపాఠీ గొప్పగా ఆడుతున్నాడని, కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ కూడా ఎడం చేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్‌లో తడబడతాడని వివరించాడు.

'ఆ తర్వాత హెన్రిక్ క్లాసెన్ వస్తాడు. అతను స్పిన్‌ను బాగా ఎదుర్కొంటాడు. కానీ చాలా చివర్లో దిగుతాడు. వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్ ఆ తర్వాత వస్తారు' అని చోప్రా వెల్లడించాడు. ఈ బ్యాటర్ల బలహీనతలను కేకేఆర్ క్యాష్ చేసుకోవాలని అనుకుంటుందని, కాబట్టి మంచి టర్నింగ్ పిచ్ తయారు చేస్తుందని చోప్రా చెప్పాడు. తమ జట్టులో నలుగురు స్పిన్నర్లను తీసుకునే అవకాశం ఉందన్నాడు.
అదే సమయంలో కేకేఆర్‌ను తమ సీమ్ బౌలింగ్‌తో సన్‌రైజర్స్ ఇబ్బంది పెట్టేయాలని చోప్రా సూచించాడు. 'సన్‌రైజర్స్ కనుక మంచి స్కోరు చేస్తే.. దాన్ని డిఫెండ్ చేసుకునే బౌలింగ్ సత్తా ఆ జట్టుకు ఉంది. బౌన్సర్లను ఎదుర్కోవడంలో కోల్‌కతాకు చాలా చెత్త రికార్డు ఉంది. కాబట్టి ఉమ్రాన్ మాలిక్‌ను బాగా యూజ్ చేసుకోవాలి. భువీకి కూడా కేకేఆర్‌పై మంచి రికార్డుంది. కాబట్టి అతను కూడా రాణిస్తే సన్‌రైజర్స్‌కు మంచి అవకాశం ఉంటుంది' అని చోప్రా వివరించాడు.