Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsKKR : దీన్ని ఫీల్డింగ్ అంటారా?.. సన్‌రైజర్స్ స్టార్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!

కేవలం టీ20లు అని కాదు. ఏ ఫార్మాట్ క్రికెట్ అయినా ఫీల్డింగ్ చాలా ముఖ్యం. అందుకే ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తుంటారు. మైదానంలో చురుగ్గా కదిలేందుకు ప్రయత్నిస్తారు. ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్‌లో కూడా అలాంటి ఘటనలు చాలానే కనిపించాయి. వయసులో చాలా సీనియర్లు అయిన అమిత్ మిశ్రా, పీయూష్ చావ్లా కూడా చిరుతల్లా కదులుతున్నారు. అలాంటిది కుర్రాడైన సన్‌రైజర్స్ స్టార్ వాషింగ్టన్ సుందర్ మాత్రం తనకు ఆడటం ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తున్నాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాది జోరు మీదున్న నితీష్ రాణా, రింకూ సింగ్ ఇద్దరూ ఇచ్చిన క్యాచ్‌లను వదిలేశాడు. అది కూడా ఒకే ఓవర్లో కావడం గమనార్హం. మార్కో యాన్సెన్ వేసిన 16వ ఓవర్లో ఈ ఘటనలు జరిగాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. యాన్సెన్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని బౌండరీ ఆవలకు బాదేందుకు రింకూ సింగ్ ప్రయత్నించాడు. లో ఫుల్ టాస్‌ను లెగ్‌సైడ్ గాల్లోకి లేపాడు. అది గాల్లోకి లేచి తన వైపు వస్తున్నా వాషింగ్టన్ సుందర్ వేగంగా రియాక్ట్ అవ్వలేదు. లేదంటే అది చాలా సులభమైన క్యాచ్ అయ్యుండేది.

Fans troll Washington Sundar

బంతి ఆల్‌మోస్ట్ తన వద్దకు వచ్చేసిన తర్వాత రెండు అడుగులు ముందుకు వేసి బౌండరీ వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఇది చూసిన కామెంటేటర్లు కూడా ఆశ్చర్యపోయారు. అతను కనీసం రియాక్ట్ అవకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇది మర్చిపోయేలోపే మరో ఘటన జరిగింది. ధనాధన్ షాట్లతో విరుచుకు పడుతున్న నితీష్ రాణా కూడా.. యాన్సెన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే టైమింగ్ మిస్ అవడంతో బంతి గాల్లోకి ఎత్తుగా లేచింది. బౌండరీ క్లియర్ చేయలేకపోయింది.

అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వాషింగ్టన్ సుందర్.. దాన్ని సులభంగా అందుుకంటాడని అంతా అనుకున్నారు. కానీ చేతుల్లోకి వచ్చిన ఆ బంతిని సుందర్ నేలపాలు చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ దీన్ని కూడా ఫీల్డింగ్ అంటారా? అని సుందర్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇలా కనీసం రియాక్షన్ లేకుండా ఉండటం, చేతుల్లోకి వచ్చిన కీలకమైన క్యాచులు వదిలేస్తూ ఆడటం ఎందుకని నిలదీశారు. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే నితీష్ రాణా ఇచ్చిన క్యాచ్‌ను అందుకున్న సుందర్.. తను చేసిన తప్పును సరిదిద్దుకున్నాడు.

Story first published: Friday, April 14, 2023, 23:10 [IST]
Other articles published on Apr 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+