Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsDC : ఐపీఎల్ కోసం తను చాలా కష్టపడ్డాడు : డేవిడ్ వార్నర్

రెండేళ్ల క్రితం వరకు సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్.. ఇప్పుడు ఢిల్లీ కెప్టెన్‌గా వచ్చి సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పెద్ద స్కోరు కూడా చేయలేదు. స్వల్ప స్కోర్లు మాత్రమే నమోదైన ఈ మ్యాచ్‌లో చివరకు 7 పరుగుల తేడాతో ఢిల్లీ నెగ్గింది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ మరోసారి పూర్తిగా విఫలమైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి అనుకున్న ఆరంభం దక్కలేదు. ఆరంభం నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. అయితే మనీష్ పాండే (32), అక్షర్ పటేల్ (34) ఇద్దరూ ఫర్వాలేదు అనిపించారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో హైదరాబాద్ కూడా ఆరంభం నుంచే తడబడింది. హ్యారీ బ్రూక్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు.

SRHvsDC Who Won Yesterday Match David Warner reaction after victory

మిగతా బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ (49), హెన్రిక్ క్లాసెన్ (31), వాషింగ్టన్ సుందర్ (24 నాటౌట్) మాత్రమే పోరాడారు. మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం స్కోర్లు కూడా చెయ్యలేకపోయారు. దీంతో సన్‌రైజర్స్ తేలిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయం తనకు ఎంతో నచ్చిందని, ఇక్కడి ప్రేక్షకులు అంటే తనకు చాలా ఇష్టమని మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ అన్నాడు

'ఇక్కడకు వచ్చి చాలా కాలమైంది. ఈ ఆట కొన్ని సవాళ్లను విసురుతుంది. తీవ్రమైన ఒత్తిడిలో ముఖేష్ కుమార్ అద్భుతంగా ఆడాడు. మా స్పిన్నర్లు కూడా రాణించారు. ప్రత్యర్థి బ్యాటర్లు ఏ బౌలర్‌కు అలవాటు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. అప్పుడే మిడిల్ ఓవర్లలో నేను చక్కగా బౌలర్లను యూజ్ చేసుకోగలుగుతా' అని చెప్పాడు. ఇషాంత్ అద్భుతంగా ఆడుతున్నాడని, ఐపీఎల్‌లో రాణించేందుకు తను చాలా కష్టపడ్డాడని చెప్పాడు. వరుసగా రెండో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని, మూడో మ్యాచ్ కూడా గెలుస్తామని ఆశిస్తున్నట్లు చెప్పాడు.

Story first published: Tuesday, April 25, 2023, 9:30 [IST]
Other articles published on Apr 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+