Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsDC : వార్నర్‌కు ఫైన్.. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో చేసిన ఆ పొరపాటుకే!

కొన్ని రోజుల క్రితం వరకు ఐపీఎల్ 2023లో ఒక్కటంటే ఒక్క విజయం కూడా లేని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పుడు వరుసగా రెండో విజయం సాధించింది. దీంతో తన పాత ఫ్రాంచైజీపై వార్నర్ తన పగ తీర్చుకున్నాడు. రెండేళ్ల క్రితం వరకు సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్.. ఇప్పుడు ఢిల్లీ కెప్టెన్‌గా వచ్చి సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించాడు.

ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ పెద్ద స్కోరు కూడా చేయలేదు. స్వల్ప స్కోర్లు మాత్రమే నమోదైన ఈ మ్యాచ్‌లో చివరకు 7 పరుగుల తేడాతో ఢిల్లీ నెగ్గింది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ మరోసారి పూర్తిగా విఫలమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీకి అనుకున్న ఆరంభం దక్కలేదు. ఆరంభం నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి.

david warner fined rs 12 lakh

అయితే మనీష్ పాండే (32), అక్షర్ పటేల్ (34) ఇద్దరూ ఫర్వాలేదు అనిపించారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో హైదరాబాద్ కూడా ఆరంభం నుంచే తడబడింది. హ్యారీ బ్రూక్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. మిగతా బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ (49), హెన్రిక్ క్లాసెన్ (31), వాషింగ్టన్ సుందర్ (24 నాటౌట్) మాత్రమే పోరాడారు.

మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం స్కోర్లు కూడా చెయ్యలేకపోయారు. దీంతో సన్‌రైజర్స్ తేలిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన సంతోషం వార్నర్‌కు బీసీసీఐ గట్టి షాకిచ్చింది. సన్‌రైజర్స్‌తో మ్యాచులో అతను అనుకున్న టైంకి ఓవర్లు పూర్తి చేయలేదని గుర్తించింది. ఈ క్రమంలో అతనిపై రూ.12 లక్షల ఫైన్ వేసినట్లు ప్రకటించింది.

Story first published: Tuesday, April 25, 2023, 15:56 [IST]
Other articles published on Apr 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+