Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRHvsDC : రివెంజ్ తీర్చుకోవడానికి వార్నర్ మామ రెడీ.. గెలిచే సత్తా సన్‌రైజర్స్‌కు ఉందా?

అర్ధంతరంగా తన చేతుల్లో నుంచి జట్టు కెప్టెన్సీ లాగేసుకొని, కనీసం జట్టులో చోటు కూడా ఇవ్వకుండా అవమానించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి డేవిడ్ వార్నర్ రెడీ అవుతున్నాడు. 2021 సీజన్‌ను సన్‌రైజర్స్ సారధిగా ప్రారంభించిన వార్నర్‌ను ఆ టీం మేనేజ్‌మెంట్ చాలా బాధ పెట్టింది. కెప్టెన్సీతోపాటు జట్టులో నుంచి కూడా తొలగించింది.

చివరకు డగౌట్‌లోకి కూడా రానివ్వలేదు. అప్పుడు స్టేడియంలో ప్రేక్షకులతో పాటు కూర్చొని సన్‌రైజర్స్‌కు సపోర్ట్ చేశాడీ ఆసీస్ స్టార్. ఇప్పుడు అదే వార్నర్.. ఢిల్లీ క్యాపిటల్స్ సారధిగా హైదరాబాద్‌లో అడుగు పెడుతున్నాడు. అతని కెప్టెన్సీలో వరుసగా ఐదు మ్యాచులు ఓడిన ఢిల్లీ.. చివరి మ్యాచ్‌లో గాడిన పడింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. వార్నర్ ఎప్పట్లాగే సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

David Warner Delhi Capitals

ఆ టీం బౌలింగ్ కూడా చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. కేకేఆర్‌పై విజయంతో జోరు మీదున్న ఢిల్లీని అడ్డుకోవడం సన్‌రైజర్స్‌కు కష్టంగా కనిపిస్తోంది. సన్‌రైజర్స్ వద్ద అద్భుతమైన బౌలింగ్ ఎటాక్ ఉంది. కానీ దాన్ని ఆ జట్టు సరిగా యూజ్ చేసుకోవడం లేదు. ఇక ఫీల్డింగ్, బ్యాటింగ్ విషయాల్లో సన్‌రైజర్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కోల్‌కతాతో జరిగిన ఒక్క మ్యాచ్‌లో మినహా.. మిగతా ఏ మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ బ్యాటింగ్ బలంగా కనిపించలేదు.

అదృష్టం కొద్దీ కేకేఆర్‌పై సెంచరీ బాదిన హ్యారీ బ్రూక్ ఆ తర్వాత మ్యాచుల్లో మళ్లీ విఫలమయ్యాడు. రాహుల్ త్రిపాఠీ కూడా రాణించడం లేదు. దీంతో ఎయిడెన్ మార్క్రమ్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. ఈ కారణంగా భారీ షాట్లు ఆడబోయి అతను అవుట్ అవుతున్నాడు. ఈ సీజన్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన రెండు సార్లు హెన్రిక్ క్లాసెన్ చెలరేగాడు. కానీ చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో వీళ్లంతా ఫర్వాలేదు అనిపించినా సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు.

అదే సమయంలో కేకేఆర్‌పై ఢిల్లీ పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్ గెలిచింది. వార్నర్ కూడా గాడిలో పడ్డాడు. మిగతా బ్యాటర్లు కూడా ఫర్వాలేదు అనిపించారు. ఇషాంత్ శర్మ సారధ్యంలోని పేస్ బౌలింగ్ యూనిట్ ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Story first published: Monday, April 24, 2023, 11:21 [IST]
Other articles published on Apr 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+