

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బోణి కొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (69: 37 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని సాధించింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం చేధనలో వార్నర్‌తో పాటు జానీ బెయిర్‌స్టో (45), విజయ్ శంకర్ (35) రాణించడంతో మరో 6 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది.
రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ (102 నాటౌట్: 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీతో నమోదు చేశాడు. ఓపెనర్ జోస్ బట్లర్ (5) ఆరంభంలోనే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్.. మరో ఓపెనర్ అజింక్య రహానే (70: 49 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) కలిసి రెండో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
జట్టు స్కోరు 134 వద్ద రహానే ఔటయ్యాడు. ఈ క్రమంలో సంజు శాంసన్ ఐపీఎల్ 2019 సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్‌స్టోక్స్ (16 నాటౌట్: 9 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిన సంజు శాంసన్ సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌కి ఇది రెండో సెంచరీ.
అంతేకాదు పిన్న వయసులో ఐపీఎల్‌లో రెండు సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా సంజు శాంసన్(25 ఏళ్లు) రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ని లక్ష్యంగా చేసుకుని హిట్టింగ్ చేసిన సంజు శాంసన్.. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 6, 4, 4, 2, 4, 4తో 24 పరుగులు పిండుకున్నాడు.
ఆ తర్వాత 20వ ఓవర్‌లోనూ వరుసగా 4, 1, 4, 2, 2Wd, 4, 4 రూపంలో 21 పరుగులు రాబట్టింది. దీంతో ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన భువీ వికెట్ లేకుండా మొత్తం 55 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా చివరి 5 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 76 పరుగుల్ని రాబట్టగలిగింది.