Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: క్వాలిఫయర్-2 చేరేదెవరు?.. ఓడితే ఇంటికే!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ సీజన్లో అత్యంత కీలక మ్యాచ్‌లలో ఒకటిగా భావిస్తున్న ఎలిమినేటర్ మ్యాచ్ ఇవాళ సాయంత్రం జరగనుంది. బుధవారం(మే 27) న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు ఈ సీజన్‌కు వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. అదే సమయంలో గెలిచిన జట్టు ఇదే మైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫైయర్-2లో తలపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇరు జట్లకు ఇది జీవన్మరణ సమస్యగా మారింది. అయితే మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు సగటున 214గా ఉంది. అంటే నేటి రాత్రి పరుగుల వరద పారనున్నట్లు తెలుస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే పైచేయి
ఈ సీజన్లో లీగ్ దశ లెక్కలను ఓ సారి పరిశీలిస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడిన రెండు సార్లూ హైదరాబాద్‌నే విజయం వరించింది. ఏప్రిల్ 13న జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 57 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించగా.. ఏప్రిల్ 25న జరిగిన రెండో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి ఎస్‌ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. టాప్-2 జట్లతో సమానంగా పాయింట్లు ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటం వల్ల హైదరాబాద్ ఎలిమినేటర్ ఆడాల్సి వస్తోంది.

SRH vs RR IPL 2026 Eliminator SRH Face RR in High-Scoring Do-or-Die Clash for Qualifier 2 Berth

పుంజుకున్న రాజస్థాన్ రాయల్స్
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు లీగ్ దశలో చివరిగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై కీలక విజయాన్ని నమోదు చేసి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో ఆడిన మ్యాచ్‌లలో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి కళ్లూ ఉన్నాయి. కెప్టెన్ రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ జట్టు, సన్‌రైజర్స్‌పై ఉన్న మునుపటి ఓటములకు ప్రతీకారం తీర్చుకుని క్వాలిఫైయర్-2కి దూసుకెళ్లాలని పట్టుదలతో ఉంది.

బలాబలాలు.. వ్యూహ ప్రతివ్యూహాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్యాటింగ్ విభాగమే అతిపెద్ద బలంగా నిలుస్తోంది. టాపార్డర్‌లో అభిషేక్ శర్మ తన దూకుడును కొనసాగిస్తుండగా.. మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ నిలకడగా రాణిస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా అవతరించాడు. హైదరాబాద్ బౌలింగ్ విభాగంలో కొంత అనుభవలేమి కనిపిస్తున్నప్పటికీ.. యువ పేసర్లు సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగలు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి సరైన సమయంలో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తన పేలుడు బ్యాటింగ్ లైన్-అప్‌తో హైదరాబాద్ బౌలింగ్ వ్యూహాలను ఎలా తిప్పికొడుతుందో చూడాలి.

ఇరు జట్ల వివరాలు
రాజస్థాన్ రాయల్స్ జట్టు:
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, దసున్ శనక, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, యష్‌రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ, రవీంద్ర జడేజా, సుశాంత్ మిశ్రా, అమన్ రావు పేరాల, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ఆడమ్ మిల్నే, సందీప్ శర్మ, షిమ్రాన్ హెట్మెయర్, కుల్దీప్ సేన్, యుద్‌వీర్ సింగ్ చరక్, క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్, ఇమాంజోత్ సింగ్ చాహల్, విఘ్నేష్ పుత్తూరు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలిల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, అనికేత్ వర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, జీషన్ అన్సారీ, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మధుశంక, క్రేన్స్ ఫులేట్రా, ఓంకార్ తర్మాలే, ఆర్ఎస్ అంబరీష్, అమిత్ కుమార్.

Story first published: Wednesday, May 27, 2026, 8:27 [IST]
Other articles published on May 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+