స్టార్ ప్లేయర్‌పై గలీజ్ వ్యాఖ్యలు - హర్భజన్ సింగ్ సస్పెండ్!!
ఐపీఎల్ 2025లో కొత్త వివాదం తలెత్తింది. సీఎస్కే - ముంబయి మ్యాచులో కామెంటేటర్ గా వ్యవహరించిన టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారీ తీశాయి. భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తూ.. అతడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అతడిని కామెంటేటరీ ప్యానెల్ నుంచి తప్పించాలని డిమాండ్లు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే
గత కొద్ది కాలంగా ఆటకు దూరంగా ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ తాజా సీజన్ లో అడుగుపెట్టాడు. అయితే ఈ రాజస్థాన్ బౌలర్.. సన్‌రైజర్స్ బ్యాటర్ల దెబ్బకు విలవిలలాడాడు. నాలుగు ఓవర్ల ఫుల్ స్పెల్ వేసిన అతడు.. తొలి ఓవర్ లోనే 23 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత 12, 22,23.. ఇలా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా 76 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు. దీంతో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ పై విమర్శలు వచ్చాయి.

అయితే ఇదే సమయంలో జోఫ్రా అర్చర్ బౌలింగ్ ను ఉద్దేశిస్తూ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు. మ్యాచ్ సమయంలో ఆర్చర్‌ను 'కాలీ ట్యాక్సీ'తో పోల్చాడు. లండన్‌లో కాలీ (బ్లాక్ కలర్) ట్యాక్సీల మీటర్లలాగా.. ఆర్చర్ మీటర్ కూడా ఈ రోజు పెరిగిపోతోంది అని కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ కామెంట్స్ వివాదాస్పదంగా మారింది. ఇది విన్న క్రికెట్ అభిమానులు.. భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తున్నారు. కామెంట్రీ ప్యానెల్ నుంచి హర్భజన్‌ను సస్పెండ్ చేయాలని అంటున్నారు. చూడాలి మరి ఈ ఆరోపణలపై హర్భజన్ సింగ్ ఎలా స్పందిస్తాడో..
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications