
ప్లే ఆఫ్ చేరడం అసాధ్యం:
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు ఐపీఎల్ 2021లో ఒక మ్యాచులో కూడా సరైన ఆట ఆటలేదు. ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ కేవలం ఒకే ఒక్క మ్యాచులో విజయం సాధించింది. 2 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ రెండో దశలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి చవిచూసింది సన్‌రైజర్స్. ఇంకా ఎస్‌ఆర్‌హెచ్ టోర్నీలో ఐదు మ్యాచులు ఆడనుంది. అన్ని గెలిచినా 12 పాయింట్లు మాత్రమే ఎస్‌ఆర్‌హెచ్ ఖాతాలో చేరుతాయి. 12 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరడం అసాధ్యం. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్లే ఆఫ్ చేరేందుకు అవకాశం ఉంది. మిగిలిన ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ దక్కనుంది. అందుకే రాజస్థాన్ జట్టుకు ఇకనుంచి ప్రతి మ్యాచ్ గెలవడం ముఖ్యమే.

హెడ్ టు హెడ్ రికార్డ్స్:
ఐపిఎల్ చరిత్రలో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు 14 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్, రాజస్థాన్ చెరో 7 మ్యాచ్‌లు గెలిచాయి. ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు హోరాహోరీగా సాగాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు తలపడగా.. హైదరాబాద్‌పై రాజస్థాన్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్ స్టేడియంలో 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండనుంది. ఆటకు ఎలాంటి వర్షపు ముప్పు లేదు. దుబాయ్ పిచ్ బ్యాటర్‌లకు అనుకూలం. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంది. ఈ వికెట్‌పై సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 160గా ఉంది. ఛేజింగ్ చేసే జట్టుకు ఇక్కడ ఏమంత గొప్ప రికార్డు లేదు. 40 శాతం మాత్రమే రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు ఇక్కడ గెలుపొందాయి.

నాలుగు మార్పులతో సన్‌రైజర్స్:
ఐపీఎల్ 2021లో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పూర్తిగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచులో కూడా సరైన ప్రదర్శన చేయలేదు. దాంతో రాజస్థాన్‌తో జరిగే మ్యాచులో అతడిపై వేటు పడనుంది. వార్నర్ స్థానంలో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే తక్కువ స్కోరుకే పరిమితమవుతున్నారు. ఇది జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఇద్దరు రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది. వృద్ధిమాన్ సాహా పరుగులు చేస్తున్నా.. భారీ ఇన్నింగ్స్ ఆడడం లేదు. వరుసగా విఫలమవుతున్న కేదార్ జాదవ్ కూడా దాదాపుగా ఈ మ్యాచ్ ఆడే అవకాశం లేదు. అతడి స్థానంలో అభిషేక్ శర్మ ఆడనున్నాడు. ఢిల్లీపై చెలరేగిన అబ్దుల్ సమద్.. కింగ్స్‌తో జరిగిన మ్యాచులో విఫలమయ్యాడు. అతడు మరోసారి సత్తాచాటాల్సిన అవసరం ఉంది. బౌలర్లో రషీద్ ఖాన్ మినహా మిగతా వారు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. నటరాజన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ అంచనాలు అందుకోవట్లేదు. దాంతో సందీప్ , ఖలీల్ స్థానాల్లో జగదీష్ సుచిత్ మరియు బాసిల్ తంపి తుది జట్టులోకి రానున్నారు.

లివింగ్‌స్టోన్, మిల్లర్ చెలరేగితే:
మరోవైపు రాజస్తాన్ రాయల్స్ తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిపాలైంది. ఢిల్లీ జట్టు శాంసన్ సేనను 33 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ ఓడిపోవడానికి కారణం బ్యాటింగే. కెప్టెన్ సంజు శాంసన్ తప్ప.. ఏ బ్యాటర్ పరుగులు చేయలేదు. లివింగ్‌స్టోన్, జైస్వాల్, మహిపాల్, మిల్లర్ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా లివింగ్‌స్టోన్, మిల్లర్ పరుగులు చేస్తే రాజస్థాన్ సునాయాస విజయం అందుకోనుంది. రాజస్థాన్‌కు పేస్ త్రయం ముస్తాఫిజుర్ రెహ్మాన్, కార్తిక్ త్యాగి, చేతన్ సకారియా బలంగా కనిపిస్తున్నారు. వారు రాణిస్తే శాంసన్ సేనకు తిరుగుండదు.

తుది జట్టు (అంచనా):
సన్‌రైజర్స్ హైదరాబాద్: జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, జగదీష్ సుచిత్, బాసిల్ థంపి.
రాజస్తాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, చేతన్ సకారియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రహమాన్, తబరైజ్ షంసి.

డ్రీం 11 టీమ్:
వృద్ధిమాన్ సాహా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, లియామ్ లివింగ్‌స్టోన్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ తెవాటియా, భువనేశ్వర్ కుమార్, ముస్తాఫిజుర్ రహమాన్, రషీద్ ఖాన్ మరియు కార్తీక్ త్యాగి.


Click it and Unblock the Notifications












