SRH vs RR: సన్‌రైజర్స్‌ ఆటగాడిపై స్లెడ్జింగ్‌కి దిగిన క్రిస్ మోరీస్.. చివరకు ఏమైందంటే?!!

IPL 2021,SRH vs RR : Chris Morris Sledge Abhsheik Sharma || Oneindia Telugu

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో వరుసగా ఐదు ఓటములను ఎదుర్కొన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. సోమవారం రాత్రి దుబాయ్ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్‌ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా సిద్ధార్థ్‌ కౌల్‌ (2/36), భువనేశ్వర్‌ కుమార్ (1/28), రషీద్‌ ఖాన్‌ (1/31) రాజస్థాన్‌ జట్టును కట్టడి చేయగా.. జేసన్‌ రాయ్‌ (60; 42 బంతుల్లో 8×4, 1×6), కేన్‌ విలియమ్సన్‌ (51 నాటౌట్‌; 41 బంతుల్లో 5×4, 1×6), అభిషేక్‌ వర్మ (21 నాటౌట్‌; 16 బంతుల్లో 1×4, 1×6) జట్టును విజయపథంలో నడిపించారు. ఐపీఎల్‌ 2021లో సన్‌రైజర్స్‌కు ఇది రెండో విజయం మాత్రమే. ఇంకా టోర్నీలో ఎస్‌ఆర్‌హెచ్ 4 మ్యాచులు ఆడనుండగా.. అన్ని గెలిచినా ప్లే ఆఫ్ చేరడం అసాధ్యమే.

స్టేడియం ఫుల్‌ చేయండి.. యూఏఈ అనుమ‌తి కోరిన బీసీసీఐ!!స్టేడియం ఫుల్‌ చేయండి.. యూఏఈ అనుమ‌తి కోరిన బీసీసీఐ!!

 తీవ్ర అసహనంలో మోరిస్:

తీవ్ర అసహనంలో మోరిస్:

ఈ మ్యాచులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ యువ హిట్టర్ అభిషేక్ శర్మపై రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ మాటల యుద్ధానికి (స్లెడ్జింగ్‌) దిగాడు. లక్ష్య ఛేదనలో 14 ఓవర్లు ముగిసే సమయానికి ఎస్‌ఆర్‌హెచ్ మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. అప్పటికి ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి 36 బంతుల్లో 41 పరుగులు కావాలి. అప్పటికే కెప్టెన్ కేన్ విలియమ్సన్‌‌కి అభిషేక్ శర్మ మంచి సహకారం అందిస్తున్నాడు. దాంతో అభిషేక్ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు మోరీస్ ప్రయత్నించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ బౌలింగ్‌కి వచ్చిన మోరీస్.. అప్పటికే రెండు ఓవర్లు వేసి 20 పరుగులు సమర్పించున్నాడు. దాంతో అతడు తీవ్ర అసహనంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే షార్ట్ పిచ్ బంతులు వేయడంతో పాటు మాటల యద్ధానికి దిగాడు.

 నాన్‌‌స్ట్రైక్ ఎండ్‌లోకి రాగానే:

నాన్‌‌స్ట్రైక్ ఎండ్‌లోకి రాగానే:

15వ ఓవర్ తొలి బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా గంటకి 136కిమీ వేగంతో క్రిస్ మోరీస్ సంధించగా.. అభిషేక్ శర్మ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఫుష్ చేశాడు. అక్కడే ఫీల్డర్ ఉండటంతో రన్ రాలేదు. దాంతో అభిషేక్ వైపు హేళనగా చూశాడు మోరీస్. అంతేకాకుండా తన నోటికి కూడా పని చెప్పాడు. రెండో బంతిని షార్ట్ పిచ్ రూపంలో మోరీస్ సంధించగా.. ఆ బంతిని అభిషేక్ బ్యాక్‌వర్డ్ స్వ్కేర్ లెగ్ దిశగా బౌండరీకి తరలించాడు. దాంతో మాటల దాడిని మరింత పెంచాడు మోరీస్. అనంతరం మోరిస్ మూడో బంతిని స్లో డెలివరీ రూపంలో విసరగా.. స్వ్కేర్ లెగ్‌లో సింగిల్ తీసి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోకి వచ్చాడు అభిషేక్. అప్పటి వరకూ ఏమీ అనని అభిషేక్.. నాన్‌‌స్ట్రైక్ ఎండ్‌లోకి రాగానే మోరీస్‌పై ఎదురుదాడికి దిగాడు. వెళ్లి బౌలింగ్ చేయాలంటూ సైగ చేశాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో.. ఫీల్డ్ అంపైర్ కలగజేసుకుని వారిని అక్కడినుంచి పంపించేశాడు.

 ఏకాగ్రత కోల్పోకుండా:

ఏకాగ్రత కోల్పోకుండా:

గొడవ అనంతరం అభిషేక్ శర్మ ఏకాగ్రత కోల్పోకుండా మ్యాచ్ ఆడాడు. ఇన్నింగ్స్ చివరి వరకూ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కి సహకారం అందించిన అభిషేక్.. చేతన్ సకారియా బౌలింగ్‌లో భారీ సిక్స్ బాదాడు. దాంతో మ్యాచ్ పూర్తిగా హైదరాబాద్ చేతుల్లోకి వచ్చేసింది. మరో 9 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచులో కేదార్ జాదవ్ స్థానంలో అభిషేక్ శర్మ ఆడాడు. జాదవ్ వరుసగా విఫలమవుతుండడంతో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌.. అభిషేక్ శర్మకి అవకాశం ఇచ్చాడు. ఇక డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన జేసన్‌ రాయ్‌ సూపర్ ఫిఫ్టీతో అలరించాడు. మొత్తానికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్ విజయం అందుకోవడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎగిరి గంతేసిన కావ్య మారన్:

ఎగిరి గంతేసిన కావ్య మారన్:

ఇన్నాళ్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో మూడాఫ్‌గా కూర్చున్న ఓనర్ కావ్య మారన్.. సోమవారం ఎగిరి గంతేసింది. మ్యాచ్ ఆసాంతం చిరునవ్వులు చిందిస్తూ అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ బ్యాటింగ్ సమయంలో ప్రతీ బంతిని ఎంజాయ్ చేసింది. రాయ్ జోరు.. కేన్ మామ క్లాస్ ఇన్నింగ్స్‌లను ఎంతో ఆస్వాదించింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులు కూడా 'ఇన్నాళ్లకు మా కావ్యపాప నవ్విందోచ్' అంటూ కామెంట్ చేస్తున్నారు. 'ఇంతకన్నా మాకేం కావాలి?' అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 28, 2021, 9:09 [IST]
Other articles published on Sep 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X