SRH vs RCB: ప్చ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్.. ఆర్‌సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.!

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో అద్భుత విజయాన్నందుకుంది. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌లో సూపర్ బౌలింగ్‌‌కు ది బెస్ట్ ఫీల్డింగ్‌తో రాణించి థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌తో ఆద్యాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 పరుగులతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 రన్స్ చేసింది. గ్లేన్ మ్యాక్స్ వెల్(41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59), విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 4 ఫోర్లతో 33) మినహా అంతా విఫలమయ్యారు. సన్‌రైజర్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు, షబాజ్ నదీమ్, నటరాజన్, భువీ తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 రన్స్‌కే పరిమితమైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 54), మనీశ్ పాండే(39 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. కైల్ జేమీసన్‌కు ఓ వికెట్ దక్కింది. ఓ దశలో సునాయసంగా గెలుస్తుందనుకున్న ఆరెంజ్ ఆర్మీ.. డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోవడంతో పాటు షాబాజ్ అహ్మద్ ఓవర్‌లో ఏకంగా మూడు వికెట్లను చేజార్చుకొని మూల్యం చెల్లించుకుంది.

సాహా విఫలం..

సాహా విఫలం..

150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. మహ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్‌లోనే ఓపెనర్ వృద్దీమాన్ సాహా(1) క్యాచ్‌ఔట్‌గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన పాండేతో కెప్టెన్ వార్నర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కైల్ జేమీసన్ వేసిన నాలుగో ఓవర్‌లో పాండే భారీ సిక్సర్ కొట్టగా.. వార్నర్ ఓ ఫోర్, సిక్స్ బాదడంతో 17 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత సుందర్ బౌలింగ్‌లో పాండే ఓ ఫోర్ కొట్టగా.. సిరాజ్ ఓవర్‌లో రెండు బౌండరీలు తరలించాడు. దాంతో పవర్‌ప్లే ముగిసే సరికి సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.

వార్నర్ హాఫ్ సెంచరీ..

వార్నర్ హాఫ్ సెంచరీ..

అనంతరం ఓవర్‌కో బౌండరీ రాబట్టిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ఈ క్రమంలో మంచి బంతులను ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలుచిక్కి బాల్స్‌ను బౌండరీలకు తరలించింది. ఈ క్రమంలో డానియల్ క్రిస్టియన్ వేసిన 13 ఓవర్ తొలి బంతికి క్విక్ డబుల్ తీసిన వార్నర్.. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికిదే ఫస్ట్ ఫిఫ్టీ. అయితే ఆ మరుసటి ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన వార్నర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో, పాండే తడబడ్డారు. ఈ క్రమంలో ఒత్తిడికి గురైన సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ వికెట్లు పారేసుకున్నారు.

 తిప్పేసిన షబాజ్ అహ్మద్..

తిప్పేసిన షబాజ్ అహ్మద్..

షబాజ్ అహ్మద్ వేసిన 17 ఓవర్‌లో జానీ బెయిర్ స్టో(12), మనీశ్ పాండే(38) వరుస బంతుల్లో ఔటవ్వగా.. చివరి బంతికి ఫించ్ హిట్టర్ అబ్దుల్ సమద్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్ చివరి బంతికి విజయ్ శంకర్ కూడా ఔటవ్వడంతో మ్యాచ్ ఆర్‌సీబీ వైపు తిరిగింది. హైదరాబాద్ విజయానికి 12 బంతుల్లో 27 పరుగులు అవసరం కాగా.. సిరాజ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతిని రషీద్ ఖాన్ భారీ సిక్సర్ కొట్టి ఆశలు రేకెత్తించాడు. కానీ తర్వాతి బంతుల్లో ఓ వికెట్ తీసిన సిరాజ్ 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

ఇక చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. హర్షల్ పటేల్ నోబాల్‌తో ఫోర్ ఇచ్చి టెన్షన్ పెట్టాడు. కానీ మిగతా బంతుల్ని కట్టుదిట్టంగా వేసి వికెట్లు తీయడంతో 9 పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో ఆర్‌సీబీ విజయం లాంఛనమైంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, April 14, 2021, 23:27 [IST]
Other articles published on Apr 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X