SRH vs PBKS: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మళ్లీ పంజా విసిరింది. సొంతగడ్డపై సంచలన విజయాన్ని అందుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 246 పరుగుల భారీ లక్ష్యాన్ని 9 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డును అభిషేక్ శర్మ అందుకున్నాడు. ఈ మ్యాచులో అభిషేక్ శర్మ (55 బంతుల్లో 141; 14×4, 10×6) సెంచరీ చేయగా.. ట్రావిస్ హెడ్ (37 బంతుల్లో 66; 9×4, 3×6) అదిరే ప్రదర్శన చేశాడు. అం
అంతకుముందు మొదట పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ( 36 బంతుల్లో 82; 6×4, 6×6), మార్కస్ స్టాయినిస్ (11 బంతుల్లో 34 నాటౌట్; 1×4, 4×6) రాణించడంతో ఈ స్కోర్ చేసింది. కాగా, నాలుగు వరుస ఓటముల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కు వచ్చిన విజయం ఇది. అలానే రెండు విజయాల తర్వాత పంజాబ్ కింగ్స్ ఎదుర్కొన్న ఓటమి ఇది.

ఇదే గొడవ..
అయితే ఈ మ్యాచులో ఓ గొడవ జరిగింది. ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్లు వివాదానికి దిగారు. సన్‌రైజర్స్‌కు చెందిన ట్రావిస్ హెడ్ - పంజాబ్ కింగ్స్ కు చెందిన మ్యాక్స్ వెల్, స్టాయినిస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మ్యాక్స్ వెల్ వేసిన 9వ ఓవర్లో ఇది చోటు చేసుకుంది. ఈ ఓవర్ లో హెడ్.. మూడు నాలుగు బంతుల్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టాడు. అయితే ఐదో బంతిని హెడ్.. నేరుగా మ్యాక్సీ వైపునకు పంపాడు. అప్పుడు మ్యాక్సీ బంతిని అందకుని దానిని వికెట్ కీపర్ వైపునకు పంపాడు. ఇది నచ్చని హెడ్.. మ్యాక్సీని సీరియస్ గా చూశాడు.
అతడు వచ్చి సెటిల్‌మెంట్..
ఇక ఓవర్ ఆరో బంతి డాట్ బాల్ గా ముగిసింది. ఓవర్ పూర్తవ్వగానే.. హెడ్ .. మ్యాక్సీని ఏదో అన్నాడు. అలా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే అప్పుడు స్టోయినిస్, అంపైర్ మధ్యలో వచ్చి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ఈ హీట్ ఆర్గ్యుమెంట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో క్రికెట్ అభిమానులంతా ఏం జరిగిందా అని తెగ ఆరా తీస్తున్నారు.