Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిషేక్ శర్మ, షెఫార్డ్ బ్యాటింగ్ వల్ల పంజాబ్ ముందు పర్వాలేదనిపించే టార్గెట్ ఉంచిన సన్ రైజర్స్

abhi

పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ (43పరుగులు 32బంతుల్లో 5ఫోర్లు 2సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (20 పరుగులు 18బంతుల్లో), అయిడెన్ మార్క్రరమ్ (21), వాషింగ్టన్ సుందర్ (25పరుగులు 19బంతుల్లో 3ఫోర్లు 1సిక్సర్), రోమరియో షెఫార్డ్ (26పరుగులు 15బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) తలా ఓ చేయి వేయడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 157పరుగులు చేయగలిగింది. ఇక పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, హర్ ప్రీత్ బార్ 3, రబాడా 1వికెట్ తీసుకున్నారు.

చివరి లీగ్ మ్యాచ్‌లో భువీ స్పెషల్
ఐపీఎల్ 2022 సీజన్‌ లీగ్ దశ ముగియబోతోంది. ఇక ఈ సాయంత్రం 7:30గంటలకు ముంబై వాంఖడే స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్, పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్నాయి. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఈ రెండు జట్లు ఇప్పటికే వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గెలుపుతో ఈ సీజన్‌ను ముగించాలనే తాపత్రయం రెండు జట్లల్లో కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు 6వ స్థానంలో నిలుస్తుంది. ఓడిన జట్టు 8వ స్థానంలో నిలుస్తుంది. ఇక ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు సన్ రైజర్స్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నాడు. ఇక న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో సన్ రైజర్స్ సారథ్య బాధ్యతలను భువీ తీసుకున్నాడు.

ఇక బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్ జోడీ జట్టుకు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఇవ్వలేకపోయింది. మూడో ఓవర్లో కగిసో రబాడా బౌలింగ్లో ప్రియమ్ గార్గ్ (4పరుగులు 7బంతుల్లో) మయాంక్ అగర్వాల్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ నడిపించాడు. అడపాదడపా ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డుకు మూమెంటమ్ తెచ్చాడు. 6వ ఓవర్ వేసిన నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో రాహుల్ త్రిపాఠి సిక్స్ కొట్టి టచ్‌లోకి వచ్చాడు. ఆ ఓవర్లో అభిషేక్ ఒక ఫోర్ కూడా కొట్టాడు. అయితే త్రిపాఠి ఔటయ్యాక.. సన్ రైజర్స్ స్కోరు వేగం తగ్గింది.తర్వాత వచ్చిన బ్యాటర్లెవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక చివర్లో రోమరియో షెఫార్డ్ కాస్త బౌండరీలు బాదడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20ఓవర్లలో 157పరుగులు చేయగలిగింది.

తుది జట్లు
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ (w), హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, ప్రేరక్ మన్కడ్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్(w), రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), ఫజల్హాక్ ఫరూఖీ, ఉమ్రాన్ మాలిక్

Story first published: Sunday, May 22, 2022, 21:56 [IST]
Other articles published on May 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+