Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్ రైజర్స్ కెప్టెన్‌ భువనేశ్వర్ కుమార్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే?

 Sunrisers Hyderabad captain Bhuvaneshwar kumar won the toss and opt to bat

ఐపీఎల్ 2022 సీజన్‌ లీగ్ దశ ముగియబోతోంది. ఈ సాయంత్రం పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ మధ్య జరిగే మ్యాచ్ చిట్టచివరిది. ఇక ప్లేఆఫ్స్ ఆరంభమౌతాయి. ఎలిమినేటర్స్, క్వాలిఫయర్స్ కోసం పోరాటం మొదలవుతుంది. ఇక ఈ సాయంత్రం 7:30 గంటలకు ముంబై వాంఖడే స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్, పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఈ రెండు జట్లు ఇప్పటికే వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గెలుపుతో ఈ సీజన్‌ను ముగించాలనే తాపత్రయం రెండు జట్లల్లో కనిపిస్తోంది. తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. ముంబై ఇండియన్స్‌ను ఓడించి కాస్త పుంజుకోగా.. ఢిల్లీ కేపిటల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు 6వ స్థానంలో నిలుస్తుంది. ఓడిన జట్టు 8వ స్థానంలో నిలుస్తుంది.

ఇక ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు సన్ రైజర్స్ సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నాడు. ఇక న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో సన్ రైజర్స్ సారథ్య బాధ్యతలను భువీ తీసుకున్నాడు. ఇక టాస్ గెలిచిన అనంతరం భువీ మాట్లాడుతూ.. మేం తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే వికెట్ రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ కు అనుకూలంగా మారొచ్చు. ఇక మా జట్టులో రొమారియో షెపర్డ్, జగదీషా సుచిత్ చేరారు. మేము ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో కొంచెంపైకి వెళ్లి ఈ సీజన్‌ను ముగించాలనుకుంటున్నామని పేర్కొన్నాడు. ఇక టాస్ ఓడిన పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'మా జట్టులో మూడు మార్పులు జరిగాయి. భాను స్థానంలో నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, రిషి ధావన్ స్థానంలో షారుక్, ప్రేరక్ మన్కడ్ జట్టులో చేరారని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరికీ జట్టులో అవకాశాలు ఇస్తున్నట్లు తెలిపాడు. ప్రతి గేమ్ ముఖ్యమైనది కాబట్టి.. నేడు గెలిచి రెండు పాయింట్లు సాధించాలని చూస్తున్నాం.' అని పేర్కొన్నాడు.

1
53679

తుది జట్లు
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ (w), హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, ప్రేరక్ మన్కడ్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్(w), రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), ఫజల్హాక్ ఫరూఖీ, ఉమ్రాన్ మాలిక్

Story first published: Sunday, May 22, 2022, 19:20 [IST]
Other articles published on May 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+