Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs PBKS: బ్యాటింగ్‌తో బరిలోకి పంజాబ్ కింగ్స్.. తుది జట్లు ఇవే..

SRH vs PBKS: ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో హైదరాబాద్ 4 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని హైదరాబాద్ జట్టు పట్టుదలతో ఉంది. ఈ సీజన్ లో నాలుగు మ్యాచ్ లలో మూడింటిలో విజయం సాధించిన పంజాబ్.. అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.

హైదరాబాద్ జట్టులో మార్పు
టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా.. హైదరాబాద్ జట్టు బౌలింగ్ చేయనుంది. పంజాబ్ కింగ్స్ జట్టు తమ ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేయలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ప్లేయింగ్ ఎలెవన్ లో ఒక మార్పు చేసింది. కమిందు మెండిస్ స్థానంలో ఇషాన్ మలింగ జట్టులోకి వచ్చాడు.

SRH vs PBKS Punjab Chooses to Bat After Winning the Toss Final Teams Revealed

తుది జట్లు ఇవే..
పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 : ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్.

పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్: సూర్యాంష్ షెడ్జ్, యష్ ఠాకూర్, ప్రవీణ్ దూబే, వైశాక్ విజయ్ కుమార్, హర్‌ప్రీత్ బ్రార్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఇషాన్ మలింగ.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ సబ్స్: అభినవ్ మనోహర్, సచిన్ బేబీ, రాహుల్ చాహర్, వియాన్ ముల్డర్, జయదేవ్ ఉనద్కట్

Story first published: Saturday, April 12, 2025, 19:30 [IST]
Other articles published on Apr 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+