Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs PBKS Dream11 Prediction: డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! ఇంజురీ అప్‌డేట్!!

SRH vs PBKS Dream11 Prediction:Captain, Vice-Captain, Fantasy Tips And Playing 11 For Match 36

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా ఈరోజు రాత్రి పంజాబ్ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్లు అమితుమీ తేల్చుకొనున్నాయి. షార్జా వేదికగా ఈ రోజు రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7:30 గంటలకు ఈ మ్యాచ్​ జరగనుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో, స్టార్ స్పోర్ట్స్‌లోనూ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు. పాయింట్ల పట్టికలో ఇరు జట్లు చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచులో గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని పంజాబ్​.. పరువు నిలబెట్టుకోవాలని సన్​రైజర్స్​ పట్టుదలతో ఉన్నాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. రెండో దశ తమ తొలి మ్యాచ్​లో విజయం వరకు వచ్చి పంజాబ్ ఓడిపోయింది. మరోవైపు సన్‌రైజర్స్‌ కూడా పేలవ బ్యాటింగ్ కారణంగా మరో పరాజయంను ఖాతాలో వేసుకుంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్:

హెడ్ టు హెడ్ రికార్డ్స్:

ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్లు 17 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ 12 మ్యాచుల్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌ కేవలం 5 మ్యాచుల్లో గెలుపొందింది. ఈ ఏడాది ప్రారంభంలో చెపాక్‌లో హైదరాబాద్ జట్టు పంజాబ్ టీంను 120 పరుగులకే పరిమితం చేసింది. షార్జా క్రికెట్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బంతి బ్యాట్ మీదకు వస్తుంది. మైదానం చాలా చిన్నది కావడంతో బౌండరీల వర్షం కురవనుంది. భారీ స్కోర్ నమోదుకానుంది. బౌలర్లకు మాత్రం షార్జా మైదానం చాలా కష్టమైనది. గత రాత్రి బెంగళూరు, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచులోనూ అదే జరిగింది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ తీసుకుంటుంది. సన్‌రైజర్స్ బౌలర్ టీ నటరాజన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. మరోవైపు పంజాబ్ జట్టులో ఇప్పడివరకు ఎలాంటి గాయాలు కాలేదు.

వార్నర్ డౌటే:

వార్నర్ డౌటే:

ఇప్పటికే పలు ఇబ్బందులతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ సతమతమువుతుంటే.. ఎడమ చేతి సీమర్ టి నటరాజన్ కోవిడ్ -19 బారిన పడ్డాడు. అతడి స్థానంలో జమ్ము కాశ్మీర్ బౌలర్‌ ఉమ్రాన్‌ను తాత్కాలికంగా జట్టులోకి తీసుకున్నారు. అయితే అతడు తుది జట్టులో ఉండే అవకాశం లేదు. ఐపీఎల్ 2021లో డేవిడ్ వార్న‌ర్ పూర్తిగా విఫలమవుతున్నాడు. తొలి దశలో ఒక మ్యాచుపై వేటు పడగా.. జానీ బెయిరిస్టో అందుబాటులో లేకపోవడంతో ఢిల్లీపై వార్నర్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచులో డకౌట్ అయ్యాడు. దాంతో అతడిపై మరోసారి వేటు పడనుంది. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కేన్ విలియమ్సన్‌, మనీశ్‌ పాండే, కేదార్ జాదవ్ గాడిలో పడాలి. అబ్దుల్ సమద్ మరోసారి పరుగులు చేయాలని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బౌలర్లో రషీద్‌ ఖాన్‌ మినహా మిగతా వారు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ తమ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. జాసన్ హోల్డర్ ప్రదర్శన కూడా ముఖ్యమే.

రాహుల్, మయాంక్ ఫామ్‌లో ఉన్నా:

రాహుల్, మయాంక్ ఫామ్‌లో ఉన్నా:

పంజాబ్ కింగ్స్ టీం పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇద్దరూ మంచి భాగస్వామ్యాలను నెలకొల్పినా.. మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్స్ దానిని కాపాడడంలో మాత్రం విఫలమవుతున్నారు. గేల్, పూరన్, మార్క్రామ్, హుడాలు రాణించాల్సి ఉంది. ఇక బౌలింగ్లో మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్‌లోనూ కీలకం కానున్నారు. ఆదిల్ రషీద్, హర్‌ప్రీత్ బ్రార్, ఇషాన్ పోరెల్‌లపై జట్టు మేనేజ్మెంట్ నమ్మకం పెట్టుకుంది. పంజాబ్ తమ చివరి మ్యాచును 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. చేతిలో 8 వికెట్లు ఉండగా రాజస్థాన్‌పై చివరి ఓవర్‌లో 4 పరుగులు చేయలేదు. ఆ ఓటమిని మరచి ముందుకు వెళ్లాల్సి ఉంది.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్/ జేసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్/జేసన్ రాయ్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్.

పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఫాబియన్ అలెన్, ఆదిల్ రషీద్, హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ షమీ, ఇషాన్ పోరెల్.

డ్రీమ్ 11 టీమ్:

డ్రీమ్ 11 టీమ్:

లోకేష్ రాహుల్ (కెప్టెన్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, మొహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, అర్షదీప్ సింగ్.

Story first published: Saturday, September 25, 2021, 14:14 [IST]
Other articles published on Sep 25, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+