Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉప్పల్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో యువీకి గాయం

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ గాయపడ్డాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా యువరాజ్ సింగ్ చేతి వేలికి గాయమైంది.

SRH vs MI: Yuvraj Singh suffers finger injury while fielding

దీంతో సన్ రైజర్స్ విజయ లక్ష్యాన్ని 139 పరుగులుగా నిర్దేశించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యువరాజ్ సింగ్ 9 పరుగులు చేశాడు. అయితే గాయం పెద్దది కాకపోవడంతో, మిగతా మ్యాచుల్లో అతడు ఆడే అవకాశముందని తెలుస్తోంది.

ఐపీఎల్ పదో సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన యువీ 234 పరుగులు చేశాడు. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌ 41 బంతుల్లో 70 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. అయితే తర్వాత చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

ఇక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి సోమవారం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో యువీ చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే హైదరాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

139 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వార్నర్‌ వికెట్‌ను ఆదిలోనే కోల్పోయినా మరో ఓపెనర్‌ శిఖర్‌ దావన్(46 బంతుల్లో 62 నాటౌట్‌)‌, హెన్రిక్స్‌(44 పరుగులు) సన్‌రైజర్స్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+