Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: ఆ కుర్రాడి వల్లే ఆల్‌టైమ్ రికార్డు- కమిన్స్

ఉప్పల్‌లో బ్యాటర్ల ఊచకోతతో ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డులు నమోదయ్యాయి. ప్రేక్షకులకు కనువిందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ సాగింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోరు, అత్యధిక ఛేజింగ్ స్కోరు, అత్యధిక సిక్సర్ల సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఇక టీ20 క్రికెట్‌లోనే అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఎస్ఆర్‌హెచ్ వర్సెసె ముంబై మ్యాచ్ నిలిచింది.

523 పరుగులు నమోదైన ఈ మ్యాచ్‌లో అంతిమంగా ముంబైపై హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 277 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (62; 24 బంతుల్లో) మొదలుపెట్టిన విధ్వంసాన్ని అభిషేక్ శర్మ (63; 23 బంతుల్లో) కొనసాగించాడు. మార్క్‌రమ్ (42*; 28 బంతుల్లో)తో కలిసి క్లాసెన్ (80*; 34 బంతుల్లో) ఊచకోతతో ఇన్నింగ్స్ ముగించాడు.

SRH vs MI We won the all-time record because of Abhishek Sharma- Pat Cummins

అనంతరం ఛేదనలో ముంబై అసాధారణ పోరాటం చేసింది. 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. తిలక్ వర్మ (64; 34 బంతుల్లో), టిమ్ డేవిడ్ (42*; 22 బంతుల్లో), ఇషాన్ కిషన్ (34; 13 బంతుల్లో) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కాగా, మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడాడు. తమ జట్టు విజయతీరాలకు చేరడంపై సంతోషం వ్యక్తం చేశాడు. అభిషేక్ శర్మను కొనియాడాడు.ఆ కుర్రాడు స్వేచ్ఛగా ఆడాడని అన్నాడు.

''పిచ్చిగా అనిపించింది. మైదానం నలుమూలలా బంతి వెళ్లింది. ముంబై గట్టిగానే ఫైట్ చేసింది. కీలక సమయాల్లో బౌండరీలు సాధిస్తూ పోటీలో నిలిచారు. కానీ మేం గొప్పగా మ్యాచ్‌ను ముగించాం. అభిషేక్ శర్మ ఆట ఎంతో ఆకట్టుకుంది. ఐపీఎల్‌లో ఎంతో ఒత్తిడి ఉంటుంది. కానీ అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. మేం 277 పరుగులు సాధించాలనుకోలేదు. పాజిటివ్‌గా, దూకుడుగా మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం''

''ఇది మంచి వికెట్‌. వీలైన బౌండరీలు సాధించాలని భావించాం. ఇక బంతితో చక్కని ప్రణాళికలు వేయడం ఇక్కడ ఎంతో కీలకం. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఎంతో మద్దతు ఇచ్చారు. స్టేడియంలో వాతావరణం అద్భుతంగా ఉంది. ఇక్కడ ఆడటాన్ని ఎంతో ఆస్వాదించా'' అని ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.

Story first published: Thursday, March 28, 2024, 8:15 [IST]
Other articles published on Mar 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+