Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI VS SRH: కళ్లు చెదిరే సిక్సులు.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!

MI VS SRH: ఐపీఎల్ 2025లో పేలవ ప్రదర్శన చేస్తోన్న ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. తాజా మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కాసేపు బ్యాట్ ఝళిపించాడు. తక్కువ సేపే క్రీజులో ఉన్నా.. ఉన్నంత సేపు అదిరిపోయే షాట్లు ఆడి తన అభిమానులను అలరించాడు. తన బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనత సాధించాడు. అదేంటంటే

ఈ సారి అదుర్స్..
ఈ ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ ఆడిన ఐదు మ్యాచుల్లో 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడు తన బ్యాటను ఝళిపించాలని అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సీజన్ లో తన ఆరో మ్యాచులో కాసేపు బ్యాటును ఝళిపించాడు రోహిత్ శర్మ. 16 బంతుల్లో 3 సిక్సుల సాయంతో 162.50 స్ట్రైక్ రేటుతో 26 పరుగులు చేశాడు.

ట్రేడ్ మార్క్ షాట్లతో..
అయితే రోహిత్ శర్మ తన ఐదో బంతికి తన ట్రేడ్ మార్క్ ఫుల్ షాట్ ఆడి సిక్స్ బాదడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కమిన్స్ బౌలింగ్ లో 3.1 ఓవర్ దగ్గర అద్భుతమైన సిక్స్ బాదాడు. ఈ క్రమంలోనే జోరు మీదున్న రోహిత్ ను కమిన్స్ పెవిలియన్ కు పంపాడు. కమిన్స్ బౌలింగ్ లో 3.5 ఓవర్ దగ్గర.. ట్రావిస్ హెడ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అత్యధిక సిక్సులు..
ఈ క్రమంలోనే మ్యాచులో అదిరిపోయే సిక్సులు బాదిన రోహిత్ శర్మ.. సిక్సుల విషయంలో ఓ అదిరిపోయే రికార్డును కూడా సాధించాడు. వాంఖెడె స్టేడియంలో 100 సిక్సులు బాదిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. అలానే ఓవరాల్ గా ఓకే వేదికగా 100 సిక్సులు బాదిన నాలుగో బ్యాటర్ గానూ నిలిచాడు.

ఒకే వేదికపై అత్యధిక సిక్సులు..
విరాట్ కోహ్లీ చిన్నస్వామి స్టేడియంలో 130 సిక్సులు
క్రిస్ గేల్ చిన్నస్వామి స్టేడియంలో 127 సిక్సులు
ఏబీ డివిలియర్స్ చిన్నస్వామి స్టేడియంలో 118 సిక్సులు,
రోహిత్ శర్మ వాంఖెడే స్టేడియంలో 100
కీరన్ పోలార్డ్ వాంఖెడే స్టేడియంలో 85

SRH VS MI Rohit Sharma smashed his 100th six at Wankhede Stadium in ipl 2025
Story first published: Thursday, April 17, 2025, 22:44 [IST]
Other articles published on Apr 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+