Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: హార్దిక్‌ వల్లే ఓటమి.. చెత్త కెప్టెన్సీ - మాజీ క్రికెటర్లు

బుధవారం ఉప్పల్‌లో పరుగుల వరద పారింది. స్టేడియంలో సిక్సర్ల వర్షానికి ప్రేక్షకులు తడిసిముద్దయ్యారు. గత ఐపీఎల్ రికార్డులు బద్దలయ్యాయి. టీమ్ అత్యధిక స్కోరు, ఛేదనలో అత్యధిక స్కోరు, అత్యధిక సిక్సర్లు.. ఇలా చరిత్ర తిరగరాశారు. ఈ అరుదైన ఘనతలకు సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ ప్రతీకగా నిలిచింది.

523 పరుగులు నమోదైన ఈ మ్యాచ్‌లో అంతిమంగా ముంబైపై హైదరాబాద్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 277 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (62; 24 బంతుల్లో) మొదలుపెట్టిన విధ్వంసాన్ని అభిషేక్ శర్మ (63; 23 బంతుల్లో) కొనసాగించాడు. మార్క్‌రమ్ (42*; 28 బంతుల్లో)తో కలిసి క్లాసెన్ (80*; 34 బంతుల్లో) ఊచకోతతో ఇన్నింగ్స్ ముగించాడు.

SRH vs MI Mumbai lost because of Hardik Worst captaincy - former cricketers

అనంతరం ఛేదనలో ముంబై అసాధారణ పోరాటం చేసింది. 20 ఓవర్లకు అయిదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. తిలక్ వర్మ (64; 34 బంతుల్లో), టిమ్ డేవిడ్ (42*; 22 బంతుల్లో), ఇషాన్ కిషన్ (34; 13 బంతుల్లో) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అయితే ముంబై ఓటమికి కారణం కెప్టెన్ హార్దిక్ పాండ్య అని పఠాన్ బ్రదర్స్ ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ పేర్కొన్నారు. హార్దిక్ పేలవమైన బ్యాటింగ్, కెప్టెన్సీ చేశాడని విమర్శించారు. ఎస్‌ఆర్‌హెచ్ మాజీ కోచ్ టామ్ మూడీ కూడా హార్దిక్ కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేశాడు.

బుమ్రాకు ఆలస్యంగా బంతిని అందించి హార్దిక్ ఘోర తప్పిదం చేశాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్ 3 ఓవర్లకు 40/0 స్కోరుతో ఉన్నప్పుడు బుమ్రా తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. 5 పరుగులే ఇచ్చాడు. కానీ బుమ్రా 13వ ఓవర్‌లో మరోసారి బంతి అందుకున్నాడు. అప్పటికే సన్‌రైజర్స్ 173/3 స్కోరు సాధించిది. ముంబైకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

అంతేగాక బ్యాటింగ్‌లోనూ హార్దిక్ నిరాశపరిచాడు. 20 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ముంబై బ్యాటర్లలో అత్యంత తక్కువ స్ట్రైక్‌రేటు సాధించింది హార్దిక్‌యే. ఈ నేపథ్యంతో ముంబై నయా కెప్టెన్‌ను విమర్శిస్తూ మాజీలు ట్వీట్ చేశారు. ''బుమ్రా ఎక్కడ? మ్యాచ్ దాదాపు ముగిసిపోయింది. ముంబై బెస్ట్ బౌలర్ ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు'' అని టామ్ మూడీ SRH బ్యాటింగ్ సమయంలో ట్వీట్ చేశాడు.

''జట్టు మొత్తం 200 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేసింది. కానీ కెప్టెన్ మాత్రం 120 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేశాడు. ఇక హార్దిక్ కెప్టెన్సీ చాలా సాధారణంగా ఉంది. అక్కడ మారణహోమం జరుగుతున్నప్పుడు బుమ్రాకు బౌలింగ్ ఇవ్వకుండా దూరంగా ఉంచడం నాకేం అర్థం కాలేదు'' అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.

Story first published: Thursday, March 28, 2024, 8:45 [IST]
Other articles published on Mar 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+