Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్.. 10 ఓవర్లకు ముంబై స్కోర్ 131! 250 కొట్టేనా?

SRH vs MI: Ishan Kishan hits 84 runs, Mumbai scores 131 after end of 10th over

అబుదాబి: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌)పై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ (ఎంఐ ).. ఆ దిశగా దూసుకెళుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై మూడు నష్టానికి 131 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (18) నెమ్మదిగా ఆడినా.. ఓపెనర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ బౌండరీల వర్షం కురిపిస్తూ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. చివరకు 32 బంతుల్లో 84 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇషాన్ తన ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. దాంతో ముంబై స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇషాన్ ప్రతి బంతిని బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. క్రమంలోనే మరో భారీ షాట్ ఆడే క్రమంలో 10వ ఓవర్ మొదటి బంతికి ఔట్ అయ్యాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో సాహాకు క్యాచ్ ఇచ్చి ఇషాన్ పెవిలియన్ చేరాడు.

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 13 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇషాన్ కిషన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లపై ఏమాత్రం కనికరం లేకుండా బౌండరీల వర్షం కురిపించాడు. ఇషాన్ బాడుతుంటే రోహిత్ అలా చూస్తుండిపోయాడు. ఇషాన్ ఊపుచూస్తే.. సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ ఉమ్రాన్ మాలిక్ ఓ అద్భుత బంతితో అతడికి కళ్లెం వేశాడు. ఇషాన్ ముంబై ఇండియన్స్ ఓ రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ టోర్నీలో 10 ఓవర్లు ముగిసేసరికి కింగ్స్ పంజాబ్ 2014లో 131 పరుగులు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును ముంబై సమం చేసింది. ముంబై ఆటగాళ్ల జోరు చూస్తే.. ఆ జట్టు 250 స్కోర్ చేసేలా ఉంది.

ఈరోజు ముంబైకి ఈ విజయం చాలా కీలకం. గత రాత్రి కోల్‌కతా విజయం తర్వాత ఇప్పుడు ఒక అద్భుతం జరిగితే మాత్రమే రోహిత్ సేన ప్లే ఆఫ్‌కి చేరుతుంది. అందుకే భారీ విజయమే లక్ష్యంగా ముంబై బరిలోకి దిగింది. ఈ మ్యాచులో 171 పరుగుల భారీ తేడాతో గెలిస్తేనే కోల్‌కతాను వెనక్కినెట్టి ముంబై ముందడుగు వేసే అవకాశం ఉంది. ముంబై -0.048 రన్‌రేట్‌తో ఆరో స్థానంలో ఉంది. ఇక మోర్గాన్‌ టీమ్‌ +0.587 నెట్‌ రన్‌రేట్‌తో ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Friday, October 8, 2021, 21:11 [IST]
Other articles published on Oct 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+