Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs LSG Toss: అందుకే మొద‌ట‌ బౌలింగ్ చేస్తున్నాం: విలియ‌మ్స‌న్.. ల‌క్నో జ‌ట్టులో కీల‌క మార్పు

SRH vs LSG Toss: SunRisers Hyderabad Won the Toss And Elected to the Fielding First

ఐపీఎల్ 2022లో భాగంగా ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్ ఎటువంటి మార్పులు లేకుండా గ‌త మ్యాచ్‌లో ఆడిన జ‌ట్టుతోనే బ‌రిలోకి దిగుతుంది. ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ మాత్రం ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతుంది. ఇక తొలి మ్యాచ్‌లో ఓడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో తొలి విజ‌యాన్ని న‌మోదు చేయాల‌ని భావిస్తోంది. ఇక గ‌త మ్యాచ్‌లో భారీ ల‌క్ష్యాన్ని చేధించి విజ‌యం అందుకున్న ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు క‌న‌బ‌ర్చాల‌ని భావిస్తోంది.

హైద‌రాబాద్ కెప్టెన్ ఏమ‌న్నాడంటే..

హైద‌రాబాద్ కెప్టెన్ ఏమ‌న్నాడంటే..

ఇక టాస్ గెలిచిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్‌ కేన్ విలియమ్స‌న్ మాట్లాడుతూ ''మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. మేము మ్యాచ్‌ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాము. మేము మా ప్రారంభ మ్యాచ్‌లో సానుకూల‌త‌ను చూశాము. ఆరంభంలోనే వికెట్లు తీయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం. మ్యాచ్ సాగే కొద్ది కొంత మంచు ప్ర‌భావం ఉండవచ్చు. మేం గ‌త మ్యాచ్‌లో ఆడిన‌ జట్టుతోనే ఈ మ్యాచ్‌లోనూ ఆడుతున్నాం. ఈ రోజు ఇక్కడ ఆడుతున్నందుకు ఆనందంగా ఉంది.'' అని చెప్పాడు.

ల‌క్నో కెప్టెన్ ఏమ‌న్నాడంటే..

ల‌క్నో కెప్టెన్ ఏమ‌న్నాడంటే..

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ''టాస్ గెలిస్తే మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాము. అది ఈ సీజ‌న్లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక‌ ట్రెండ్‌గా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో మేము ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతున్నాం. చమీర స్థానంలో జేస‌న్ హోల్డర్ జ‌ట్టులోకి వచ్చాడు. మేము గేమ్‌కు ముందు కొంత హోంవర్క్ చేశాం. అది మ్యాచ్‌లో అమలు చేస్తాం. మేము హోల్డ‌ర్‌ను వేలంలో ఎంచుకున్నాము. ఎందుకంటే అతను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్ రౌండర్. అతను కొత్త బంతిని స్వింగ్ చేయగలడు. బ్యాక్ ఎండ్‌లో కూడా కొంత డ్యామేజ్ చేయగలడు. మా లోయర్, మిడిల్ ఆర్డర్ గ‌త రెండు గేమ్‌లు బాగా ఆడాయి. అది మాకు అగ్రస్థానంలో కష్టపడగలమన్న విశ్వాసాన్ని ఇస్తుంది. యువ ఆట‌గాడు (ఆయుష్ బడోని) మిడిల్ ఆర్డ‌ర్‌లో రాణించ‌డం మాకు క‌లిసొస్తుంది. నిజంగా అతని ఆట చూడటం చాలా బాగుంది. అతను అదే ఫామ్‌ను కొనసాగించాల‌నుకుంటున్నాం'' అని చెప్పాడు.

 తుది జట్లు

తుది జట్లు

లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్), మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ (వికెట్ కీప‌ర్‌), ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.

Story first published: Monday, April 4, 2022, 19:30 [IST]
Other articles published on Apr 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+