Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs LSG: ఆ స్పీడ్ ఏంటి ఉమ్రాన్ మాలిక్‌.. 150 కిలో మీట‌ర్ల‌కు పైగా వేగం.. కానీ..

SRH vs LSG: Sunrisers Hyderabad bowler Umran Malik bowls at 152 kmph

లక్నోసూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పేస్ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్ సూప‌ర్ ఫాస్ట్ వేగంతో స‌త్తా చాటాడు. ప్ర‌తి బంతిని గంట‌కు 140 కిలో మీట‌ర్ల‌కు పైగా వేగంతో వేశాడు. అత్యధికంగా ఓ బంతిని దాదాపు 152 కిలో మీట‌ర్ల వేగంతో వేశాడు. 11వ ఓవ‌ర్ మూడో బంతిని స‌రిగ్గా 151.8 కిలో మీట‌ర్ల వేగంతో వేశాడు. దీంతో ఆ బంతి ఈ మ్యాచ్‌లో అత్యంత వేగంగా వేసినదిగా నిలిచింది. మాలిక్ వేసిన స్లో బంతి ఈ మ్యాచ్‌లో 140 కిలో మీట‌ర్లుగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ స‌గ‌టు స్పీడ్ 147.1 కిలో మీట‌ర్లుగా ఉంది. మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ వేసిన మొద‌టి ఓవ‌ర్లోని మొత్తం ఆరు బంతుల వేగాన్ని ఒక సారి గ‌మ‌నిస్తే 140, 146, 146, 142, 148, 148 కిలో మీటర్లుగా నమోదయ్యాయి.

వేగంలో అయితే ఉమ్రాన్ మాలిక్ స‌క్సెస్ అయ్యాడు కానీ వికెట్లు తీయ‌డంలో దారుణంగా విఫ‌ల‌మ‌య్యాడు. వికెట్లు తీయడం కూడా ప‌క్క‌న పెడితే భారీగా ప‌రుగులు ఇచ్చాడు. మ్యాచ్‌లో బౌలింగ్ చేసింది 3 ఓవ‌ర్లే అయిన‌ప్ప‌టికీ ఏకంగా 13 ఎకాన‌మీతో 39 ప‌రుగులు ఇచ్చాడు. దీంతో అత‌నికి కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ పూర్తి బౌలింగ్ కోటా వేసే అవ‌కాశాన్ని కూడా ఇవ్వ‌లేదు. మ‌రొక ఓవ‌ర్‌ను అబ్దుల్ స‌మ‌ద్‌తో వేయించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ముందు ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ 170 ప‌రుగుల ట‌ఫ్ ల‌క్ష్యాన్ని ఉంచింది. ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 170 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ (68), దీప‌క్ హుడా (51) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్, న‌ట‌రాజ‌న్, రొమారియో షెపర్డ్ రెండేసి వికెట్లు తీశారు.

Story first published: Monday, April 4, 2022, 23:04 [IST]
Other articles published on Apr 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+