
దెబ్బకొట్టిన సుందర్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నోసూపర్ జెయింట్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో కీలక వికెట్లు తీయడంతో ఆ జట్టు 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలతో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించిన క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్‌ను సుందర్ ఒక్కొ పరుగుకే ఔట్ చేశాడు. డికాక్‌ను విలియమ్సన్ సూపర్ క్యాచ్‌తో ఫెమిలియన్ పంపగా.. లూయిస్ ఎల్బీలో ఔట్ చేశాడు. ఆ కాసేపటికే మనీష్ పాండే (11 రన్స్.. ఒక ఫోర్, ఒక సిక్స్)ను రొమారియో షెపర్డ్ ఔట్ చేయడంతో 4.5 ఓవర్లలో 27 పరుగులకే 3 వికెట్లు కొల్పోయి లక్నో కష్టాల్లో పడింది.

ఆదుకున్న రాహుల్, హుడా
ఈ క్రమంలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్.. మిడిలార్డర్ బ్యాటర్ దీపక్ హుడాతో కలిసి జట్టు ఆదుకున్నారు. వీరిద్దరు నాల్గో వికెట్‌కు 62 బంతుల్లోనే 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో దీపక్ హుడా ఈ సీజన్లో రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్ కెరీర్లో ఐదవది. అయితే ఈ భాగస్వామ్యాన్ని రొమారియో షెపర్డ్ విడదీశాడు. 16వ తొలి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన దీపక్ హుడా( 51 రన్స్.. 3 ఫోర్లు, 3 సిక్సులు) బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠికి దొరికిపోయాడు. దీంతో లక్నో 114 పరుగుల వద్ద నాల్గో వికెట్ కోల్పోయింది.

బర్త్‌డే భాయ్ నటరాజన్ సూపర్ యార్కర్
అనంతరం కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 28వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం వాషింగ్టన్ సుందర్ వేసిన 17వ ఓవర్లో మొదటి రెండు బంతులను సిక్సు, ఫోర్ బాదాడు. ఆ ఓవర్లో మొత్తం 17 పరుగులు వచ్చాయి. అయితే 18వ ఓవర్లో భువనేశ్వర్ కుమార్ కట్టడి చేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అనంతరం 19వ ఓవర్లో ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న నటరాజన్ చెలరేగాడు. జట్టు స్కోర్ 144 పరుగుల వద్ద ఉండగా ఆ ఓవర్ తొలి బంతికి కేఎల్ రాహుల్ (68 రన్స్, 6 ఫోర్లు, ఒక సిక్సు)ను ఎల్బీలో, నాల్గో బంతికి కృనాల్ పాండ్యా (6 రన్స్, ఒక ఫోర్)ను అద్భుత యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ ఓవర్లో 8 పరుగులు మాత్రమే ఇచ్చిన నటరాజన్ 2 కీలక వికెట్లు తీశాడు.

చివరి ఓవర్లో 17 రన్స్
ఇక రొమారియో షెపర్డ్ వేసిన చివరి ఓవర్లో ఆయుష్ బడోని (19 రన్స్.. 3 ఫోర్లు), హెల్డర్ (8*, ఒక సిక్సు) కలిసి 17 పరుగులు రాబట్టారు. దీంతో 20 ఓవర్ల ముగిసే సమయానికి లక్నో సూపర్ జెయింట్స్ 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, నటరాజన్ రెండేసి వికెట్లు తీశారు.


Click it and Unblock the Notifications












