For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs LSG: కేన్ మామ సూప‌ర్ క్యాచ్‌.. కావ్య పాప ముసి ముసి న‌వ్వులు.. డికాక్‌కు దిమ్మ తిరిగింది

SRH vs LSG: Kane Williamson Gets Brilliant Catch To Get Rid Of De Kock & Kavya Maran Happy smiles

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ సూప‌ర్ క్యాచ్ దెబ్బకు క్వింట‌న్ డికాక్‌కు దిమ్మ‌తిరిగింది. హైద‌రాబాద్ ఆల్‌రౌండ‌ర్‌ వాషింగ్ట‌న్ సుంద‌ర్ బౌలింగ్‌లో వ‌చ్చిన సూప‌ర్ క్యాచ్‌ను కేన్ మామ అద్భుతంగా ప‌ట్టుకోవ‌డంతో డికాక్ ఔట్ అయ్యాడు. తొలి వికెట్ ప‌డిన వెంట‌నే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓన‌ర్ కావ్య మార‌న్ సంతోషం వ్య‌క్తం చేస్తూ ముసి ముసి న‌వ్వులు న‌వ్వ‌డం వైర‌ల్‌గా మారింది.

తొలి ఓవ‌ర్‌ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేసిన వెంట‌నే విలియ‌మ్స‌న్ తెలివిగా రెండో ఓవ‌రే స్పిన్న‌రైనా వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు ఇచ్చాడు. ఆ అవ‌కాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న సుంద‌ర్.. ఆ ఓవ‌ర్ రెండో బంతికే డికాక్‌ను ఫెమిలియ‌న్ చేర్చాడు. సుంద‌ర్ బౌలింగ్‌లో డికాక్ కొట్టిన ఆఫ్ సైడ్ షాట్‌ను విలియ‌మ్స‌న్ ఎడ‌మ వైపుగా ప‌రిగెత్తుతూ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో గ‌త మ్యాచ్‌లో హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగిన డికాక్ ఈ మ్యాచ్‌లో 4 బంతులు ఎదుర్కొన్ని ఒక ప‌రుగుకే ఔట‌య్యాడు.

SRH vs LSG: Kane Williamson Gets Brilliant Catch To Get Rid Of De Kock & Kavya Maran Happy smiles

ఆ త‌ర్వాతి ఓవ‌ర్లో మ‌రోసారి చెల‌రేగిన వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఒకే ఒక్క ప‌రుగు చేసిన ఎవిన్ లూయిస్‌ను ఎల్బీడ‌బ్ల్యూలో ఔట్ చేశాడు. సూప‌ర్ హాఫ్ సెంచ‌రీతో గత మ్యాచ్‌లో లక్నో విజ‌యం సాధించ‌డంలో లూయిస్ కీల‌క పాత్ర పోషించాడు. ఆ త‌ర్వాత ఐదో ఓవ‌ర్‌లో మ‌నీష్ పాండే కూడా ఔట‌వ‌డంతో 27 ప‌రుగుల‌కే 3 కీల‌క వికెట్లు కోల్పోయిన ల‌క్నో క‌ష్టాల్లో ప‌డింది. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో మ‌నీష్ పాండే (11 ర‌న్స్‌.. ఒక ఫోర్, ఒక సిక్సు) ఔటయ్యాడు.

తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్), మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్ (వికెట్ కీప‌ర్‌), ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.

Story first published: Monday, April 4, 2022, 20:16 [IST]
Other articles published on Apr 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+