Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతడు చెప్పాడు నేను చేశాను - అందుకే గెలిచాం : పంత్

SRH VS LSG: ఐపీఎల్‌ 2025 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపునకు దగ్గరకు వెళ్లి స్వీయ తప్పిదాలతో ఓడిపోయిన లక్నో.. తమ రెండో పోరులో మాత్రం అద్భుతమైన ఆటతీరు కనబరిచి సత్తా చాటింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. శార్దూల్ ఠాకూర్ బంతితో, పూరన్‌ బ్యాటుతో విజృంభించడంతో.. బలమైన సన్‌రైజర్స్‌కు అంతే బలంగా షాక్ తగిలింది. ఫలితంగా ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరిగిన ఈ మాచులో 5 వికెట్ల తేడాతో లక్నో గెలిచింది.

లక్నో జట్టులో మహ్మద్‌ షమి (1/37), ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (1) ఔటవడం తప్పితే.. మిగతావాళ్లు అద్భుతం చేశారు. సన్‌రైజర్స్‌ 200లోపే ఆలౌటైన పిచ్‌పై లక్నో చెలరేగిపోయింది. పూరన్‌ పూనకం వచ్చినట్టు ఊగిపోతూ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. మిచె్ మార్చ్ కూడా చెలరేగి ఆడాడు. దీంతో 7.3 ఓవర్లలోనే ఆ జట్టు 100 పరుగుల మార్క్ ను టచ్ చేసింది. అయితే పూరన్ పరుగుల తుఫాన్‌ను కమిన్స్‌ (2/29) అడ్డుకున్నాడు. అతడి బౌలింగ్ లో పూరన్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో మార్ష్‌తో కలిసి రెండో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. కమిన్స్‌ తర్వాతి ఓవర్లోనే మార్ష్‌ ఔటయ్యాడు. అయినా అప్పటికే లక్నో లక్ష్యానికి చేరువై విజయాన్ని అందుకుంది. అనంతరం పంత్‌ (15) త్వరగానే ఔటయ్యాడు. సమద్‌ (8 బంతుల్లో 22 నాటౌట్‌; 2×4, 2×6), మిల్లర్‌ (13 నాటౌట్‌) మ్యాచును ముగించారు.

SRH VS LSG IPL 2025 Rishab Pant Says we can t focus on uncontrollables for win against sunrisers

అ అదే మా విజయానికి అసలు కారణం
మ్యాచ్ అనంతరం విజయానికి గల కారణాన్ని లక్నో కెప్టెన్ పంత్ ఆనందం వ్యక్తం చేశాడు. గెలిచినప్పుడు అతిగా స్పందించి, ఓడినప్పుడు నిరాశ చెందనని చెప్పాడు. "అమ్మయ్య, ఇప్పుడు పెద్ద ప్రశాంతంగా ఉంది. అయితే ఒక జట్టుగా మేము ఎప్పుడూ ఎలా రాణించాలనే దానిపై దృష్టి పెడటాం. గెలిచినప్పుడు అతిగా ఆనందించకూడదు, ఓడిపోయినప్పుడు తీవ్రంగా నిరాశ చెందకూడదు. జట్టుగా మేము నియంత్రించలేని విషయాలపై ఆలోచించడం కన్నా, మా నియంత్రణలో ఉన్న విషయాలపైనే దృష్టి పెట్టాలి అని నా మెంటార్ చెప్పారు. అదే నేను చేశాను. ప్రిన్స్ వేసిన బంతి చాలా బాగా ఉంది. అద్భుతంగా బౌలిగ్ చేశాడు. అలాగే ఠాకూర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పూరన్ కు మేము స్వేచ్ఛ ఇవ్వాలనుకున్నాం. ఒక బ్యాటర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు అతడికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. అతడు మా కోసం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మొత్తం జట్టు క్రమంగా సమిష్టిగా రాణిస్తూ, మెరుగవుతోంది. ఇప్పటివరకు మా ఉత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయినా, గెలిచినందుకు సంతోషంగా ఉంది." అని పంత్ పేర్కొన్నాడు.

Story first published: Friday, March 28, 2025, 7:00 [IST]
Other articles published on Mar 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+