Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs LSG: చరిత్ర సృష్టించిన నికోలస్ పూరన్!!

SRH vs LSG: ఉప్పల్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ అంచనాలకు తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయింది. గత మ్యాచులో సన్ రైజర్స్ స్కోర్లు, ఆటగాళ్ల ప్రదర్శన చూసి ఈసారి కచ్చితంగా 300 పరుగుల స్కోర్ నమోదవుతుందని అంతా అనుకున్నారు. కానీ అంచనాలు బోల్తా కొట్టాయి. లక్నో ఆటగాళ్లు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి విజయాన్ని అందుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ (4/34), నికోలస్ పూరన్ (70; 26 బంతుల్లో 6×4, 6×6) జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ మ్యాచుతో నికోలస్ పూరన్ అరుదైన రికార్డ్ సాధించాడు. అలానే మ్యాచ్ అనంతరం .. తన టీమ్ మేట్ రవి బిష్ణోయ్ కు క్షమాపణలు కూడా చెప్పాడు. ఎందుకంటే

క్రికెట్ లో సాధారణంగా డ్రాప్ క్యాచులు ఉండటం సహజం. అయితే క్యాచ్ మిస్ లు.. మ్యాచ్ గెలుపుఓటముల్లో కీలకంగా వ్యవహరిస్తుంటాయి. అలానే తాజాగా జరిగిన సన్ రైజర్స్ వర్సెస్ లక్నో మ్యాచులోనూ కొన్ని క్యాచ్ మిస్ లు చోటు చేసుకున్నాయి. అందులో సన్ రైజర్స్ ట్రావిస్ హెడ్ బంతి కూడా ఒకటి. వాస్తవానికి మ్యాచ్ ప్రారంభంలోనే కీలక అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వికెట్లను పోగొట్టుకుంది సన్ రైజర్స్. కానీ ఆ తర్వాత ట్రావిస్ హెడ్ భారీ షాట్లు ఆడుతూ కాసేపు క్రీజులో నిలిచాడు. 28 బంతుల్లో 5×4, 3×6 పరుగుల సాయంతో 47 పరుగులు చేశారు.

SRH vs LSG IPL 2025 Nicholas Pooran sets records with Half century in 18 balls against sunrisers

ఇంకోసారి అలా జరగదు క్షమించు..
అయితే ట్రావిస్ హెడ్ ముందుగానే ఔట్ అవ్వాల్సింది. కాకపోతే రెండు సార్లు లైఫ్ లభించడంతో ఆ మాత్రం స్కోర్ చేశాడు. అందులో ఓ సారి రవి బిష్ణోయ్ బౌలింగ్ లో నికోలస్ పూరన్.. క్యాచ్ మిస్ చేయడంతో ట్రావిస్ హెడ్ కు లైఫ్ దొరికింది. ఆరో ఓవర్ 4 బంతికి ఇది జరిగింది. కానీ చివరికి ప్రిన్స్ యాదవ్ అద్భతమైన బంతితో హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అందుకే మ్యాచ్ అనంతరం నికోలస్ పూరన్.. తన జట్టు సహచర ఆటగాడికి క్షమాపణలు తెలిపాడు. "రవి బిష్ణోయ్ నీకు క్షమాపణలు చెబుతున్నాను. నీ ట్రావిస్ హెడ్ క్యాచ్ మిస్ చేశాను. నువ్వు బాధపడి ఉంటే నిజంగా సారీ సారీ. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను" అని చెప్పుకొచ్చాడు.

పూరన్ విధ్వంసానికి రికార్డుల దాసోహం
ఈ మ్యాచులో లక్నో బ్యాటర్ పూరన్ అరుదైన రికార్డు కూడా సంపాదించాడు. ఐపీఎల్ లో లక్నో తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేశాడు. 20 బంతుల్లోపే అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. పూరన్ ఈ ఘనత ఇప్పటికీ 4 సార్లు సాధించగా ఆ తర్వాతి స్థానాల్లో హెడ్, మెక్ గుర్క్ మూడేసి సార్లు ఈ మార్క్ ను అందుకున్నారు. కాగా, ఈ మ్యాచులో పూరన్ 26 బంతుల్లోనే 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 70 పరుగులు విధ్వంసం సృష్టించాడు.

Story first published: Friday, March 28, 2025, 13:36 [IST]
Other articles published on Mar 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+