దెబ్బకొట్టిన సుందర్
బ్యాటింగ్ ఆరంభించిన లక్నోసూపర్ జెయింట్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ రెండో ఓవర్లోనే దెబ్బకొట్టాడు. ఆ ఓవర్ రెండో బంతికి క్వింటన్ డికాక్‌ను ఒక్క పరుగుకే ఔట్ చేశాడు. డికాక్ ఇచ్చిన క్యాచ్‌ను సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుతంగా పట్టుకున్నాడు. కాగా గత మ్యాచ్‌లో 61 పరుగులతో లక్నో విజయంలో డికాక్ కీలక పాత్ర పోషించాడు. ఆ వెంటనే మరో సారి చెలరేగిన సుందర్ నాల్గో ఓవర్‌లో ఒక్క పరుగుకే ఎవిన్ లూయిస్‌ను ఎల్బీడబ్ల్యూలో ఔట్ చేశాడు. దీంతో లక్నో 16 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కాగా గత మ్యాచ్‌లో 23 బంతుల్లోనే 55 పరుగులతో చెలరేగిన లూయిస్ లక్నోను గెలిపించడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. అట్టి ఇద్దరు ఆటగాళ్లను త్వరగా ఔట్ చేసి సన్‌రైజర్స్‌కు సుందర్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.

విలియమ్సన్ సూపర్ క్యాచ్
హైదరాబాద్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వచ్చిన సూపర్ క్యాచ్‌ను కేన్ మామ అద్భుతంగా పట్టుకోవడంతో డికాక్ ఔట్ అయ్యాడు. తొలి వికెట్ పడిన వెంటనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ సంతోషం వ్యక్తం చేస్తూ ముసి ముసి నవ్వులు నవ్వడం వైరల్‌గా మారింది. తొలి ఓవర్‌ను భువనేశ్వర్ కుమార్ వేసిన వెంటనే విలియమ్సన్ తెలివిగా రెండో ఓవరే స్పిన్నరైనా వాషింగ్టన్ సుందర్‌కు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న సుందర్.. ఆ ఓవర్ రెండో బంతికే డికాక్‌ను ఫెమిలియన్ చేర్చాడు. సుందర్ బౌలింగ్‌లో డికాక్ కొట్టిన ఆఫ్ సైడ్ షాట్‌ను విలియమ్సన్ ఎడమ వైపుగా పరిగెత్తుతూ అద్భుతంగా అందుకున్నాడు.

27 పరుగులకే 3 వికెట్లు
దీంతో గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన డికాక్ ఈ మ్యాచ్‌లో 4 బంతులు ఎదుర్కొన్ని ఒక పరుగుకే ఔటయ్యాడు. ఆ తర్వాత ఐదో ఓవర్‌లో మనీష్ పాండే కూడా ఔటవడంతో 27 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన లక్నో కష్టాల్లో పడింది. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో మనీష్ పాండే (11 రన్స్.. ఒక ఫోర్, ఒక సిక్సు) ఔటయ్యాడు.
తుది జట్లు
లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్


Click it and Unblock the Notifications












