For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs LSG: దెబ్బ‌కొట్టిన ఆవేష్ ఖాన్‌.. బ్యాటింగ్ వైఫ‌ల్యంతో మ‌ళ్లీ ఓడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌

SRH vs LSG: Avesh Khan Taken 4 Key Wickets.. Sunrisers Hyderabad defeat 12 runs beat by Lucknow supergiants

ఐపీఎల్ 2022లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ ఆరంభంలో వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ విసిరిన 170 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించ‌లేక బ్యాటింగ్ వైఫ‌ల్యంతో 12 ప‌రుగుల తేడాతో ఓట‌మిని మూటగ‌ట్టుకుంది. రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో త్రిపాఠి (44), పూర‌న్ (34) మాత్ర‌మే కాస్త రాణించారు. మిగ‌తవారంతా విఫ‌ల‌మ‌య్యారు. 4 కీల‌క వికెట్ల‌తో ల‌క్నో విజ‌యంలో ఆవేష్ ఖాన్ కీల‌క‌పాత్ర పోషించాడు. చివ‌రి ఓవ‌ర్లో 3 వికెట్ల‌తో హోల్డ‌ర్ కూడా రైజ‌ర్స్‌ను దెబ్బ‌కొట్టాడు. కాగా ఇప్ప‌టికే మొద‌టి మ్యాచ్‌లోనూ స‌న్‌రైజ‌ర్స్ ఓడిన సంగ‌తి తెలిసిందే. దీంతో రైజ‌ర్స్ తొలి విజ‌యం కోసం మ‌ళ్లీ ఎదురుచూడ‌క త‌ప్ప‌డం లేదు.

 ఓపెన‌ర్లు విఫ‌లం

ఓపెన‌ర్లు విఫ‌లం

170 ప‌రుగుల ట‌ఫ్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ (16), అభిషేక్ శ‌ర్మ(13) శుభ‌రంభాన్ని అందించ‌లేక‌పోయారు. 5 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి వీరిద్ద‌రిని ఆవేష్ ఖాన్ ఫెమిలియ‌న్ చేర్చాడు. దీంతో హైద‌రాబాద్ 38 ప‌రుగుల‌కు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ క్ర‌మంలో రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మాక్ర‌మ్ క‌లిసి మూడో వికెట్‌కు 44 ప‌రుగులు జోడించారు.

దెబ్బ‌కొట్టిన కృనాల్ పాండ్యా

దెబ్బ‌కొట్టిన కృనాల్ పాండ్యా

ఈ క్ర‌మంలో స‌న్‌రైజ‌ర్స్‌ను కృనాల్ పాండ్యా దెబ్బ‌కొట్టాడు. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఎయిడెన్ మాక్ర‌మ్ (12), రాహుల్ త్రిపాఠి (44 ర‌న్స్‌, 5 ఫోర్లు, ఒక సిక్సు)ని ఫెమిలియ‌న్ చేర్చాడు. భారీ షాట్లు ఆడే క్ర‌మంలో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి మాక్ర‌మ్, ర‌వి బిష్ణోయ్‌కు క్యాచ్ ఇచ్చి త్రిపాఠి ఔట్ అయ్యారు. దీంతో 13.1 ఓవ‌ర్ల‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 95 ప‌రుగుల‌కు 4 వికెట్లు కోల్పోయింది. ఈ క్ర‌మంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌తో క‌లిసి నికోల‌స్ పూర‌న్ ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించాడు. భారీ షాట్టు బాదుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు.

దెబ్బ‌కొట్టిన ఆవేష్ ఖాన్‌

దెబ్బ‌కొట్టిన ఆవేష్ ఖాన్‌

చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిలిచి పూర‌న్‌ జ‌ట్టును గెలిపిస్తాడ‌ని అంతా భావించారు. కానీ స‌న్‌రైజ‌ర్స్ ఆశల‌పై ఆవేష్ ఖాన్ నీళ్లు చ‌ల్లాడు. చివ‌రి 3 ఓవ‌ర్ల‌లో 33 ప‌రుగులు కావాల్సిన స‌మ‌యంలో ఆవేష్ ఖాన్ బౌలింగ్ చేశాడు. తొలి బంతిని సిక్స‌ర్ బాదిన పూర‌న్.. రెండో బంతిని కూడా భారీ షాట్ ఆడే క్ర‌మంలో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న దీప‌క్ హుడాకు దొరికిపోయాడు. మొత్తంగా 3 ఫోర్లు, 2 సిక్సుల‌తో 24 బంతుల్లో 34 ప‌రుగులు చేశాడు. ఆ త‌ర్వాతి బంతికే అబ్దుల్ స‌మ‌ద్ వికెట్ కీప‌ర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి డ‌కౌట్ అయ్యాడు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ 143 ప‌రుగుల‌కు 6 వికెట్లు కోల్పోయింది.

 స‌న్‌రైజ‌ర్స్ ఓట‌మి

స‌న్‌రైజ‌ర్స్ ఓట‌మి

ఇక స‌న్‌రైజ‌ర్స్ విజ‌యానికి చివ‌రి 2 ఓవ‌ర్ల‌లో 26 ప‌రుగులు కావాల్సి ఉండ‌గా క్రీజులో సుంద‌ర్, షెఫ‌ర్డ్ ఉన్నారు. ఆండ్రూ టై వేసిన 19వ ఓవ‌ర్లో 10 ప‌రుగులు వ‌చ్చాయి. మొద‌టి నాలుగు బంతులు సింగిల్స్ రాగా.. నాల్గో బంతిని షెప‌ర్డ్ సిక్సు బాద‌డంతో స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌లోకి వ‌చ్చింది. దీంతో హోల్డ‌ర్ వేసిన చివ‌రి ఓవ‌ర్లో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యానికి 16 ప‌రుగులు కావాల్సి రాగా భారీ షాట్‌కు ప్ర‌యత్నించి తొలి బంతికే వాషింగ్ట‌న్ సుంద‌ర్ (18 ర‌న్స్‌.. ఒక ఫోర్‌) ఔట‌య్యాడు. రాహుల్ ఆ క్యాచ్ అందుకున్నాడు. రెండో బంతికి భువి, మూడో బంతికి షెప‌ర్డ్ సింగిల్స్ తీశారు. నాల్గో బంతిని భారీ షాట్ ఆడే క్ర‌మంలో భువ‌నేశ్వ‌ర్ (1) ఔట‌య్యాడు. ఐదో బంతికి ఉమ్రాన్ మాలికి సింగిల్ తీయ‌గా.. చివ‌రి బంతికి షెప‌ర్డ్ ఔట‌య్యాడు. దీంతో 9 వికెట్ల న‌ష్టానికి 157 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 12 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. చివ‌రి ఓవ‌ర్లో 3 ప‌రుగులు మాత్ర‌మే చేసిన స‌న్‌రైజ‌ర్స్ 3 వికెట్లు కోల్పోయింది. ఓపెన‌ర్ల వికెట్ల‌తోపాటు పూర‌న్, స‌మ‌ద్ వికెట్లు తీసి రైజ‌ర్స్‌ను ల‌క్నో బౌల‌ర్ ఆవేష్ ఖాన్ దారుణంగా దెబ్బ‌కొట్టాడు. మొత్తంగా 4 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన ఆవేష్ ఖాన్ 24 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 4 కీల‌క వికెట్ల‌తో చెల‌రేగాడు. మిగ‌తా బౌల‌ర్ల‌లో హోల్డ‌ర్ 3, కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశారు.

చెల‌రేగిన రాహుల్‌, దీప‌క్ హుడా

చెల‌రేగిన రాహుల్‌, దీప‌క్ హుడా

అంత‌కుముందు టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ 7 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు చేసింది. ఆరంభంలోనే వాషింగ్ట‌న్ సుంద‌ర్, రొమారియో షెపర్డ్ దెబ్బ‌కొట్ట‌డంతో 4.5 ఓవ‌ర్ల‌లో ఆ జ‌ట్టు 27 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయింది. డికాక్ (1), లూయిస్ (1), మ‌నీష్ పాండే (11) స్వ‌ల్ప స్కోర్ల‌కే ఔట‌య్యారు. ఈ క్ర‌మంలో హాఫ్ సెంచ‌రీల‌తో రాహుల్ (68), దీప‌క్ హుడా (51) ఆదుకున్నారు. వీరిద్ద‌రు నాల్గో వికెట్‌కు 84 ప‌రుగులు జోడించాక 16వ ఓవ‌ర్లో దీప‌క్ హుడాను రొమారియో షెపర్డ్ ఔట్ చేశాడు. ఇక 19వ ఓవ‌ర్లో న‌ట‌రాజ‌న్ రాహుల్, కృనాల్ పాండ్యా(6)ను ఔట్ చేశాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో వాషింగ్ట‌న్ సుంద‌ర్, రొమారియో షెపర్డ్, న‌ట‌రాజ‌న్ రెండేసి వికెట్లు తీశారు.

స్కోర్లు:

ల‌క్నోసూప‌ర్ జెయింట్స్‌: 169-7

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌: 157-9

Story first published: Monday, April 4, 2022, 23:47 [IST]
Other articles published on Apr 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+