Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs KKR: మారని తీరు.. సన్‌రైజర్స్ హ్యాట్రిక్ ఓటమి

SRH vs KKR: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు 120 పరుగులకే ఆలౌట్ అయింది. క్లాసెన్ 33 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కమిందు మెండిస్ 27 పరుగులతో రాణించాడు. మిగతా వారు దారుణంగా విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ అరోరా , వరుణ్ చక్రవర్తి తలో మూడు వికెట్లు పడగొట్టగా, రస్సెల్ రెండు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు.

మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరును చేసింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆరంభంలోనే ఇద్దరూ పెవిలియన్ చేరారు. తన మొదటి ఓవర్లోనే హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ క్వింటన్ డికాక్(1) వికెట్ ను పడగొట్టాడు. 14 పరుగుల వద్ద జట్టు మొదటి వికెట్ కోల్పోగా.. తర్వాత ఓవర్లో సునీల్ నరైన్(7)ను షమీ వెనక్కి పంపాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ మిడిల్ ఆర్డర్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది, వెంకటేష్ అయ్యర్ 25 బంతుల్లో అర్ధ సెంచరీతో తన విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. అంగ్క్రిష్ రఘువంశీ కూడా అర్ధ సెంచరీ సాధించి, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆతిథ్య జట్టు 200 పరుగులు సాధించడంలో సహాయపడ్డాడు.

SRH vs KKR Sunrisers Hyderabad Faces Hat-Trick Defeat in IPL 2025

వెంకటేష్ అయ్యర్(60), రఘువంశీ(50), అజింక్యా రహానే(38) , రింకూసింగ్ రాణించారు. రఘువంశీ 32 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేయగా.. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడి 60 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లు చివరి 5 ఓవర్లలో 78 పరుగులు చేయడం విశేషం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కు 201 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌలింగ్ లో మహ్మద్ షమీ, పాట్ కమిన్స్ జీషాన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, April 3, 2025, 23:34 [IST]
Other articles published on Apr 3, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+