IPL 2021: మిస్ యూ 'విలియమ్సన్'‌.. వార్నర్, రషీద్ కంటే బెటర్ ప్లేయర్! కేన్ మామ ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లం!

#IPL2021: Fans Furious as Kane Williamson Misses SRH VS KKR Match | Oneindia Telugu

చెన్నై: తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 10 పరుగుల తేడాతో ఓడింది. 188 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ బౌలర్ల దెబ్బకు సన్‌రైజర్స్ 177/5కే పరిమితమైంది. జానీ బెయిర్‌స్టో (55: 40 బంతుల్లో 5x4, 3x6) కీలక సమయంలో ఔట్ కాగా.. మనీశ్ పాండే (61 నాటౌట్: 44 బంతుల్లో 2x4, 3x6) చివరి వరకూ క్రీజులో ఉండి పోరాడినా ప్రయోజనం లేకపోయింది. మొత్తానికి బ్యాటింగ్‌లో తడబడిన సన్‌రైజర్స్ మూల్యం చెల్లించుకుంది.

RR vs PBKS: అతడు లేకపోవడం మాకు పెద్ద ఎదురుదెబ్బే: సంగక్కర

విలియమ్సన్‌కు దక్కని చోటు:

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్‌కు తుది జట్టులో అవకాశం దక్కలేదు. అతడి స్థానంలో అనూహ్యంగా మహ్మద్ నబీ జట్టులోకి వచ్చాడు. నబీ తన కోటా 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టినా.. బ్యాటింగ్‌లో మాత్రం తడపడ్డాడు. ఒత్తిడి తట్టుకోలేక కీలక సమయంలో పెవిలియన్ చేరాడు. నబీ స్థానంలో విలియమ్సన్‌ ఆడి ఉంటే.. సన్‌రైజర్స్ మ్యాచ్ గెలిచేదని ఫాన్స్ అంటున్నారు. కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే కేన్.. ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేయగల ప్లేయర్. సన్‌రైజర్స్ జట్టులో బౌలర్లు ఉన్నా కూడా వార్నర్.. నబీని తుది జట్టులోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

కేన్ మామ ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లం:

కేన్ మామ ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లం:

మహ్మద్ నబీ స్థానంలో కేన్ విలియమ్సన్‌ ఆడి ఉంటే.. సన్‌రైజర్స్ మ్యాచ్ గెలిచేదని ఫాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అదేసమయంలో కేన్ మామను ఎందుకు తీసుకోలేదని డేవిడ్ వార్నర్‌పై మండిపడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట విలియమ్సన్‌పై పెద్ద చర్చ నడుస్తోంది. మిస్ యూ 'విలియమ్సన్' అని ఒకరు పోస్ట్ చేయగా.. 'కేన్ మామ ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లం' అని మరొకరు ట్వీట్ చేశారు. వార్నర్, రషీద్ కంటే కేన్ బెటర్ ప్లేయర్, ఎస్‌ఆర్‌హెచ్.. కేన్‌ను ఉపయోగించుకోకపోతే నేను ఇంద్రనగర్ కా గుండా అవుతాను, నాలుగో స్థానంలో విలియమ్సన్ కంటే బెటర్ ప్లేయర్ లేడు అంటూ పోస్టులు చేస్తున్నారు.

గాయం నుంచి కోలుకోలేదా:

గాయం నుంచి కోలుకోలేదా:

అయితే కేన్ విలియమ్సన్‌ ఇంకా గాయం నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. సన్‌రైజర్స్ కోచ్ ట్రెవర్ బేలిస్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. విలియమ్సన్‌కు రెస్ట్ ఇద్దామనే మ్యాచ్ ఆడించలేదని తెలిపాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ మోచేతి గాయంతో బాధపడుతున్నాడు. గాయం కారణంగానే ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు అతను దూరమయ్యాడు. కేన్ ఎడమ మోచేతిలో చిన్న టియర్ ఉందని, అతనికి రిహాబిలిటేషన్ అవసరమని న్యూజిలాండ్ క్రికెట్ మెడికల్ మేనేజర్ డేలే షాకెల్ తెలిపారు. అయినా కేన్ మామ ఐపీఎల్ 2021 కోసం వచ్చాడు.

10 పరుగులతో ఓటమి:

10 పరుగులతో ఓటమి:

188 పరుల భారీ ఛేదనలో ఆదిలోనే ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్ ‌(3), వృద్ధిమాన్‌ సాహా (7) వికెట్లు కోల్పోయిన హైదరాబాద్.. ఆ‌ తర్వాత గొప్పగా పుంజుకుంది. మనీశ్‌ పాండే (61; 44 బంతుల్లో 2x4, 3x6), జానీ బెయిర్‌స్టో (55; 40 బంతుల్లో 5x4, 3x6) అర్ధ శతకాలతో రాణించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే కీలక సమయంలో బెయిర్‌స్టో ఔటవ్వడంతో హైదరాబాద్‌ స్కోర్‌ వేగం తగ్గింది. మహ్మద్‌ నబీ (14), విజయ్‌ శంకర్ ‌(11) విఫలమయ్యారు. చివర్లో అబ్దుల్ సమద్ ‌(19; 8 బంతుల్లో 2x6) రెండు సిక్సులు బాదినా అప్పటికే ఆసల్యం అయింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, April 12, 2021, 9:30 [IST]
Other articles published on Apr 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X