For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs KKR: మూడుసార్లు గోల్డెన్‌ డక్‌‌.. మూడుసార్లు 80+ స్కోర్స్! రానా అరుదైన రికార్డు!

SRH vs KKR: Nitish Rana makes unique record in IPL with last six innings

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 14వ సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేసింది. మొదటగా బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్‌లో సత్తాచాటిన కేకేఆర్‌ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుని టోర్నీలో బోణి కొట్టింది. ఈ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ సాధించిన కేకేఆర్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ నితీశ్‌ రాణా (80; 56 బంతుల్లో 9x4, 4x6)కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్'‌ అవార్డు లభించింది.

0, 81, 0, 87, 0, 80:

0, 81, 0, 87, 0, 80:

మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌ 187 పరుగుల భారీ స్కోరు చేయడంలో నితీష్‌ రాణా కీలకపాత్ర పోషించాడు. శుభ్‌మన్ గిల్ త్వరగానే పెవిలియన్ చేరినా.. రాహుల్ త్రిపాఠితో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే రానా ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్‌లో రానా చివరి ఆరు ఇన్నింగ్స్‌లు చూసుకుంటే.. వరుసగా 0, 81, 0, 87, 0, 80 పరుగులు చేశాడు. ఇందులో విశేషమేమిటంటే సరి, బేసి విధానంలో మూడు సార్లు గోల్డెన్‌ డక్‌.. మరో మూడు సార్లు 80కి పైగా పరుగులు సాధించాడు. ఇలా టోర్నీలో ఇప్పటివరకూ ఎవరూ పరుగులు చేయలేదు.

కరోనాను జయించి:

కరోనాను జయించి:

కొన్నేళ్లుగా కోల్‌కతా బ్యాట్స్‌మన్‌గా చక్కటి ఆటతీరుతో ఆకట్టుకుంటున్న నితీశ్‌ రాణా.. కొత్త సీజన్‌ వస్తోందంటే చెలరేగిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఈసారి ఆడిన తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. ఐపీఎల్ 2021కి ముందు కరోనా బారినప్పటికీ.. మానసిక స్థైర్యంతో దాన్ని జయించి మైదానంలో అడుగుపెట్టి చూడముచ్చటైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఓపెనర్‌గా వచ్చి ఎలాంటి తడబాటు లేకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో మైదానంలోని అన్ని వైపులా బంతిని బౌండరీలకు తరలించాడు. కవర్‌డ్రైవ్‌లు, కట్‌ షాట్లు, లాఫ్టెడ్‌ షాట్లు ఇలా అతని బ్యాటింగ్‌ విన్యాసాలకు చెన్నై వేదికగా నిలిచింది.

రెండో వికెట్‌కు ఏకంగా 93 పరుగులు:

రెండో వికెట్‌కు ఏకంగా 93 పరుగులు:

కోల్‌కతా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ ‌గిల్ ‌(15) విఫలమైనా.. రాణా, త్రిపాఠి (53; 29 బంతుల్లో 5x4, 2x6) అర్ధ శతకాలతో మెరిశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 93 పరుగులు జోడించారు. అయితే శతక భాగస్వామ్యం వైపు దూసుకుపోతున్న వీరిని నటరాజన్‌ విడదీశాడు. రాహుల్‌ను ఔట్‌ చేయడంతో కోల్‌కతా స్కోర్‌ 146/2గా నమోదైంది. ఆపై వెనువెంటనే మరో మూడు వికెట్లు పడటంతో కోల్‌కతా పరుగుల వేగానికి బ్రేక్‌ పడింది. రాణా, రసెల్ ‌(5), మోర్గాన్ ‌(2) వరుసగా పెవిలియన్‌ చేరారు. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (22; 9 బంతుల్లో 2x4, 1x6) బౌండరీలు బాదడంతో కోల్‌కతా భారీ స్కోర్ చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో నబీ, రషీద్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

పాండే మెరిసినా:

పాండే మెరిసినా:

భారీ ఛేదనలో ఆదిలోనే ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్ ‌(3), వృద్ధిమాన్‌ సాహా (7) వికెట్లు కోల్పోయిన హైదరాబాద్.. ఆ‌ తర్వాత గొప్పగా పుంజుకుంది. మనీశ్‌ పాండే (61; 44 బంతుల్లో 2x4, 3x6), జానీ బెయిర్‌స్టో (55; 40 బంతుల్లో 5x4, 3x6) అర్ధ శతకాలతో రాణించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే కీలక సమయంలో బెయిర్‌స్టో ఔటవ్వడంతో హైదరాబాద్‌ స్కోర్‌ వేగం తగ్గింది. మహ్మద్‌ నబీ (14), విజయ్‌ శంకర్ ‌(11) విఫలమయ్యారు. చివర్లో అబ్దుల్ సమద్ ‌(19; 8 బంతుల్లో 2x6) రెండు సిక్సులు బాదినా అప్పటికే ఆసల్యం అయింది. కోల్‌కతా బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు

Story first published: Monday, April 12, 2021, 7:27 [IST]
Other articles published on Apr 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+