SRH vs KKR: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ కు దిగింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆరంభంలోనే ఇద్దరూ పెవిలియన్ చేరారు. తన మొదటి ఓవర్లోనే హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ క్వింటన్ డికాక్(1) వికెట్ ను పడగొట్టాడు. 14 పరుగుల వద్ద జట్టు మొదటి వికెట్ కోల్పోగా.. తర్వాత ఓవర్లో సునీల్ నరైన్(7)ను షమీ వెనక్కి పంపాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కేకేఆర్ బ్యాటర్లు తమ బ్యాట్ ను ఝులిపించారు. వెంకటేష్ అయ్యర్(60), రఘువంశీ(50), అజింక్యా రహానే(38) , రింకూసింగ్ రాణించారు. రఘువంశీ 32 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేయగా.. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో విరుచుకుపడి 60 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కు 201 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌలింగ్ లో మహ్మద్ షమీ, పాట్ కమిన్స్ జీషాన్ అన్సారీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ తలో వికెట్ పడగొట్టారు.