Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ ఓడిన సన్‌రైజర్స్‌: గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

హైదరాబాద్: సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ. తొలి మ్యాచ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారీస్కోరు సమర్పించుకుంది. సొంతగడ్డపై ఆరంభ పోరులో అన్ని విభాగాల్లోనూ తేలిపోయి రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది.

రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో చిత్తుగా ఓడింది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్య ఛేదనలో గంభీర్‌ (60 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌తో 90 నాటౌట్‌) చెలరేగడంతో కోల్‌కత్తా మరో 10 బంతులు మిగిలుండగానే రెండే వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది.

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

ఉప్పల్ (హైదరాబాద్)లోని సొంత మైదానం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది.

 గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు రాబట్టగా, కోల్‌కతా నైట్ రైడర్స్ 18.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 146 పరుగులు సాధించి లక్ష్యాన్ని అధిగమించింది.

 గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి నైట్ రైడర్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ గౌతమ్ గంభీర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కైవసం చేసుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లు ఘోరంగా విఫలమయ్యారు.

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (6), ఓపెనర్ డేవిడ్ వార్నర్ (13), ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ మోజెస్ హెన్రిక్స్ (6)తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడా (6) స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరడంతో సన్‌రైజర్స్ జట్టు 50 పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

 గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

ఈ తరుణంలో ఇయాన్ మోర్గాన్ (51), వికెట్ కీపర్ నమన్ ఓజా (37) కొద్దిసేపు స్థిమితంగా ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు 67 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. వీరి నిష్క్రమణ తర్వాత ఆశిష్ రెడ్డి 13 పరుగులు సాధించి రనౌటవగా, కర్ణ్ శర్మ (2), భువనేశ్వర్ కుమార్ (0) అజేయంగా నిలిచారు.

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

దీంతో సన్‌రైజర్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు కైవసం చేసుకోగా, మోర్న్ మోర్కెల్ రెండు వికెట్లు, ఆండ్రూ రసెల్ ఒక వికెట్ అందుకున్నారు.

 గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన నైట్ రైడర్స్‌కు ఓపెనర్లు రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్ చక్కటి శుభారంభాన్ని అందించారు. సన్‌రైజర్స్ బౌలర్లను సమర్థవంతంగా ప్రతిఘటించిన వీరు 92 పరుగుల భాగస్వామ్యంతో గట్టి పునాది వేశారు.

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

ఆ తర్వాత 13వ ఓవర్‌లో ఆశిష్ రెడ్డి వేసిన బంతిని ఎదుర్కోబోయి ఉతప్ప (38) లెగ్ బిఫోర్ వికెట్ రూపంలో నిష్క్రమించగా, అతని స్థానంలో వచ్చిన ఆండ్రూ రసెల్ (2) ముస్త్ఫాజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

పూర్తి ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒక క్యాచ్‌, ఒక వికెట్‌.. హైలైట్స్‌గా నిలిచాయి. హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో బౌండ్రీలైన్‌ వద్ద రస్సెల్‌, చావ్లా ఇద్దరూ కలిసి అద్భుత క్యాచ్‌తో నమన్‌ ఓఝాను అవుట్‌ చేశారు. మోర్కెల్‌ బౌలింగ్‌లో నమన్‌ భారీ షాట్‌ ఆడగా.. ఆండ్రీ రస్సెల్‌ పరిగెత్తుకుంటూ వచ్చి ఎడమ చేత్తో బంతిని అందుకున్నాడు.

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

బ్యాలెన్స్‌ తప్పి బౌండ్రీలైన్‌లోకి అడుగుపెట్టే ముందు కూడి చేత్తో బంతిని చావ్లా వైపు విసిరాడు. అయితే, రన్నింగ్‌లో ఉన్న చావ్లా తన తలమీదుగా వెళ్తున్న బంతిని జంప్‌ చేసి ఎడమ చేత్తో పైకి లేపాడు. తర్వాత రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. ఇక కోల్‌కతా ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో ఆండ్రీ రస్సెల్‌ను అద్భుత బంతితో బౌల్డ్‌ చేసిన ముస్తాఫిజుర్‌ అదరహో అనిపించాడు.

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

ముస్తాఫిజుర్‌ సంధించిన యార్కర్‌కు రస్సెల్‌ బిత్తరపోయాడు. దాన్ని డిఫెన్స్‌ ఆడే ప్రయత్నంలో బ్యాలెన్స్‌ కోల్పోయి ఒక్కసారిగా కిందపడ్డాడు. కాస్త ఆలస్యంగా స్వింగ్‌ అయిన బంతి.. బ్యాట్‌, ప్యాడ్స్‌ మధ్యలోంచి వెళ్లి వికెట్లను కూల్చింది.

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

గంభీర్ మెరుపులు, కోల్‌కత్తా విజయం

అయితే అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన గౌతమ్ గంభీర్ (90), మనీష్ పాండే (11) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేయడంతో 18.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 146 పరుగులు సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మరో 10 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+