Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs KKR: కాటేరమ్మ కొడుకా మజాకా!..కోల్‌కతా ముందు భారీ లక్ష్యం

SRH vs KKR: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు 279 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. హెన్రిచ్ క్లాసెన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. 37 బంతుల్లోనే సెంచరీని బాదాడు. అదే సమయంలో ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ శర్మ 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో క్రీజులో ఉన్నంత సేపు అద్భుతంగా ఆడాడు. ఇషాన్ కిషన్ 20 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 29 పరుగులతో రాణించాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు పడగొట్టగా.. వైభవ్ అరోరా ఒక వికెట్ తీశాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్ 2025లో సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో ఇది క్లాసెన్‌కు రెండో సెంచరీ. అభిషేక్, హెడ్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించగా.. తర్వాత వచ్చిన క్లాసెన్ వచ్చిన వెంటనే దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించాడు.కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున హెన్రిచ్ క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ తరఫున చేసిన వేగవంతమైన సెంచరీ ఇది. అంతకుముందు ఈ రికార్డు ట్రావిస్ హెడ్ పేరిట ఉండేది. అతను 39 బంతుల్లో సెంచరీ చేశాడు. మొత్తంగా ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన సెంచరీ.

SRH vs KKR Heinrich Klaasen Smashes Fastest Century for SRH

ఐపీఎల్‌లో వేగవంతమైన సెంచరీ(బంతులపరంగా)
30 -క్రిస్ గేల్ (RCB) vs పూణే వారియర్స్ ఇండియా, బెంగళూరు, 2013
35 - వైభవ్ సూర్యవంశీ (RR) vs గుజరాత్ టైటాన్స్, జైపూర్, 2025
37 - యూసుఫ్ పఠాన్ (RR) vs ముంబై ఇండియన్స్, ముంబై, 2010
37 - హెన్రిచ్ క్లాసెన్ (SRH) vs KKR, ఢిల్లీ, 2025
38 - డేవిడ్ మిల్లర్ (KXIP) vs RCB, మొహాలీ, 2013

రోహిత్ శర్మను సమం చేసిన క్లాసెన్
ఐపీఎల్‌లో హెన్రిచ్ క్లాసెన్‌కి ఇది రెండో సెంచరీ. అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో హెన్రిచ్ క్లాసెన్ రోహిత్ శర్మను సమం చేశాడు. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ కూడా తన ఖాతాలో రెండు సెంచరీలు మాత్రమే చేశాడు. 2008లో అరంగేట్రం చేసిన రోహిత్ ఇప్పటివరకు 269 మ్యాచ్‌లు ఆడాడు. ఇది ఐపీఎల్‌లో హెన్రిచ్ క్లాసెన్‌కు 49వ మ్యాచ్. చివరికి హెన్రిచ్ క్లాసెన్ 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతను ఈ ఇన్నింగ్స్‌ను 39 బంతుల్లో ఆడాడు.

Story first published: Sunday, May 25, 2025, 21:44 [IST]
Other articles published on May 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+