SRH vs KKR: ఐపీఎల్ 2025లో భాగంగా 68వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును 110 పరుగుల తేడాతో దారుణంగా ఓడించింది. ఐపీఎల్ 2025 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ముగించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 279 పరుగుల కొండంత లక్ష్యాన్ని కేకేఆర్ జట్టుకు నిర్దేశించింది. సమాధానంగా కేకేఆర్ జట్టు కేవలం 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన సీజన్ ను విజయంతో ముగించగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
హెన్రిచ్ క్లాసెన్ తుఫాను సెంచరీ
హెన్రిచ్ క్లాసెన్ తుఫాను సెంచరీ(105*), ట్రావిస్ హెడ్(76) అర్థ సెంచరీ చేసిన క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్ర మోడో అతిపెద్ద జట్టు స్కోరు కావడం గమనార్హం. ప్రస్తుత సీజన్‌లో రెండో అతిపెద్ద జట్టు స్కోరు. ఐపీఎల్ చరిత్రలో 4 అతిపెద్ద జట్టు స్కోర్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు సొంతం చేసుకుంది. 2024 ఏప్రిల్ 15న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ స్కోరు. ప్రస్తుత సీజన్ లో మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పాట్ కమిన్స్ జట్టు ఆరు వికెట్లకు 286 పరుగులు చేసింది.

కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలం
279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో కేకేఆర్ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. సునీల్ నరైన్ కొన్ని శక్తివంతమైన షాట్లు కొట్టాడు కానీ 16 బంతుల్లో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. క్వింటన్ డి కాక్ కేవలం 9 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానే కూడా బ్యాట్‌తో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. 15 పరుగులు చేసిన తర్వాత జయదేవ్ ఉనద్కట్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్‌లను హైదరాబాద్ బౌలర్ హర్ష్ దుబే రెండు బంతుల్లోనే పెవిలియన్‌కు వెనక్కి పంపాడు. రింకు 9 పరుగులు చేయగా, రస్సెల్ గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అంగ్‌క్రిష్ రఘువంశీ కూడా కేవలం 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.
110 పరుగుల వద్ద 7 వికెట్లు కోల్పోయిన తర్వాత, మనీష్ పాండే, హర్షిత్ రాణా బాధ్యత తీసుకుని కొన్ని శక్తివంతమైన షాట్లు కొట్టారు. మనీష్ 22 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. వైభవ్ అరోరా ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. హర్షిత్ రాణా 21 బంతుల్లో 34 పరుగులు చేయడంతో కేకేఆర్ 168 పరుగులకు ఆలౌట్ అయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున జయదేవ్ ఉనద్కట్, హర్ష్ దుబే, ఇషాన్ మలింగ తలా మూడు వికెట్లు పడగొట్టారు.
క్లాసెన్-హెడ్ విధ్వంసం
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కు శుభారంభం లభించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి వికెట్ కు కేవలం 6.5 ఓవర్లలోనే 92 పరుగులు జోడించారు. అభిషేక్ 16 బంతుల్లో 32 పరుగులు చేయగా, హెడ్ 40 బంతుల్లో 76 పరుగులు చేసి ఔటయ్యారు. తన ఇన్నింగ్స్‌లో, హెడ్ 6 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత క్లాసెన్ బ్యాటింగ్ ఆర్డర్‌లో పదోన్నతి పొంది మూడో స్థానంలో వచ్చాడు. క్లాసెన్ వచ్చిన వెంటనే, హెడ్‌తో కలిసి విధ్వంసం సృష్టించాడు. ఎస్ఆర్‌హెచ్ తరపున క్లాసెన్ అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్లాసెన్ 39 బంతుల్లో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అదే సమయంలో, ఇషాన్ కిషన్ 20 బంతుల్లో 29 పరుగులు చేశాడు, దీని కారణంగా హైదరాబాద్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేయగలిగింది.చాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో మొత్తంగా మూడో వేగవంతమైన సెంచరీ.