
విలియమ్సన్‌ను తీసుకోకపోవడం వల్లే:
ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం వల్లే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, టీ నటరాజన్, రసీద్ ఖాన్, విజయ్ శంకర్‌లు బౌలర్ల రూపంలో ఉండగా.. మహ్మద్ నబీకి చోటివ్సాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నబీ స్థానంలో విలియమ్సన్‌ను వేసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది. బౌలర్‌గా నబీ 4 ఓవర్లలలో రెండు వికెట్లు తీసి 32 పరుగులిచ్చాడు. బౌలర్‌గా రాణించినా బ్యాట్‌తో విఫలం అయ్యాడు. కేన్ లేకపోవడమే సన్‌రైజర్స్ ఓటమిపై ప్రబావం చూపించింది.
వేగంగా ఆడలేకపోయిన మనీష్:
హాఫ్ సెంచరీ చేసిన మనీశ్ పాండే.. ఇన్నింగ్స్ చివరలో ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. బెయిర్‌స్టో ఔటయ్యే సమయానికి సన్‌రైజర్స్ 42 బంతుల్లో 86 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సమయంలమో విజయ్ శంకర్ (11: 7 బంతుల్లో), అబ్దుల్ సమద్ (19 నాటౌట్: 8 బంతుల్లో) ధాటిగా ఆడారు. కానీ మనీశ్ మాత్రం ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌కే పరిమితమయ్యాడు. 14వ ఓవర్‌లో ఒక సిక్స్ బాదిన మనీశ్.. ఆ తర్వాత చివరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఒక్క బౌండరీ బాధలేదు. డాట్ బాల్స్ ఎక్కువగా ఆడాడు. మనీశ్ బౌండరీలు బాదుంటే మ్యాచ్ గెలిచేవాళ్లమే.

బెయిర్‌స్టో ఆ షాట్ ఆడి ఉండకుంటే:
ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన పాట్ కమిన్స్.. చివరి నాలుగు బంతులకీ నిప్పులు చెరిగాడు. మూడో బంతిని గంటకి 146కిమీ వేగంతో సంధించిన కమిన్స్.. ఆ తర్వాత కూడా వరుసగా 143, 145 కిమీ వేగంతో విసిరాడు. దాంతో అప్పటి వరకూ స్వేచ్ఛగా ఆడుతున్నట్లు కనిపించిన బెయిర్‌స్టో.. వరుసగా మూడు బంతులకి పరుగులు రాబట్టలేకపోయాడు. అప్పటి వరకూ రెండు పరుగులే రావడంతో.. చివరి బంతిని సాహసోపేతంగా భారీ షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. బెయిర్‌స్టో ఆ షాట్ ఆడి ఉండకుంటే.. మరిన్ని పరుగులు చేసేవాడు. అప్పుడు మ్యాచ్ సునాయాసంగా గెలిచేందుకు వీలుండేది.

భువీ చివరి ఓవర్ బాగా వేసుంటే:
పేసర్ భువనేశ్వర్ కుమార్ తన కోటా 4 ఓవర్లలో 1 వికెట్ తీసి ఏకంగా 45 పరుగులు ఇచ్చాడు. మొదటి స్పెల్ అద్భుతంగా వేసిన భువీ.. రెండో స్పెల్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మొదటి స్పెల్‌లోని తొలి ఓవర్లో 4, రెండో ఓవర్లో 6 రన్స్ ఇచ్చి అద్భుతంగా రాణించాడు. ఇక 15వ ఓవర్ బౌలింగ్ చేసి ఏకంగా 19 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కెప్టెన్ వార్నర్ అతనికి మళ్లీ బంతి ఇవ్వలేదు. ఇక 20వ ఓవర్ వేసిన భువీ 16 రన్స్ ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. భువీ చివరి ఓవర్ బాగా వేసినా.. సన్‌రైజర్స్ గెలిచేదే. ఇక హిట్టర్ అయిన సమద్.. బ్యాటింగ్‌లో వెనక్కి రావడం కూడా ఓ కారణమే.


Click it and Unblock the Notifications












