
అందుకే ముదుగా ఫీల్డింగ్
''మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. మంచు కురిసే అవకాశం ఉన్నందున ముందుగా మేము ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించాం. మేము రెండవ మ్యాచ్‌లో, మూడవ మ్యాచ్‌లో మెరుగుపడ్డాం. ఈ మ్యాచ్‌లో మరింత మెరుగుపడగలమని ఆశిస్తున్నాము. వారు వివిధ మైదానాల్లో ఆడుతున్నారు. దాన్ని మేము అనుకూలంగా మార్చుకోవాలి. మా ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు లేవు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం.'' అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చెప్పాడు.

బ్యాటింగ్ కూడా మంచిదే
మంచు కారణంగా వారు మొదట బౌలింగ్ చేస్తారని, అయితే మొదట బ్యాటింగ్ చేయడం కూడా మంచిదని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. ఫలితాల కంటే ప్రక్రియ చాలా ముఖ్యమైనదని, కష్టపడి ఆడితే ఫలితాలు వస్తాయని తెలిపాడు. రాహుల్ తెవాటియా గురించి మాట్లాడుతూ అతను ఫినిషర్‌గా రాణిస్తున్నాడని, అందుకోసం నెట్స్‌లో చాలా కష్టపడుతున్నానని చెప్పాడు. ఇక తమ ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు లేవని గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నామని హార్దిక్ పాండ్యా చెప్పాడు.

తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్‌రామ్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్


Click it and Unblock the Notifications












