Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs GT: అదృష్ట‌మంటే నీదేపో మ‌నోహ‌ర్.. 9 బంతుల వ్య‌వ‌ధిలో 3 క్యాచ్‌లు మిస్‌

SRH vs GT: Sunrisers Hyderabad fielders dropped 3 catches by Abhinav Manohar.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ బ్యాట‌ర్ అభిన‌వ్ మ‌నోహ‌ర్‌కు అదృష్టం భ‌లే క‌లిసొచ్చింది. అత‌ను ఇచ్చిన 3 క్యాచ్‌ల‌ను స‌న్‌రైజ‌ర్స్ ఫీల్డ‌ర్లు నెల‌పాలు చేశారు. అది కూడా 9 బంతుల వ్య‌వ‌ధిలో కావ‌డం గ‌మ‌నార్హం. అస‌లు ఏం జ‌రిగిందంటే.. గుజ‌రాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో 14వ ఓవ‌ర్లో డేవిడ్ మిల్ల‌ర్ ఔటైన వెంట‌నే మ‌నోహ‌ర్ క్రీజులోకి వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో ధాటిగా ఆడుతూ గుజ‌రాత్ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. అయితే న‌ట‌రాజ‌న్ వేసిన‌ 18వ ఓవ‌ర్ రెండో బంతిని మ‌నోహ‌ర్ భారీ షాట్ ఆడాడు. ఈ క్ర‌మంలో బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఎయిడెన్ మాక్ర‌మ్ వ‌ద్ద‌కు ఆ బంతి వెళ్లింది. కానీ ఆ క్యాచ్‌ను మాక్ర‌మ్ జార‌విడ‌చ‌డంతో మాక్ర‌మ్ ఔటయ్యే ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌పడ్డాడు. అప్ప‌టికీ మ‌నోహ‌ర్ 21 ర‌న్స్ చేశాడు.

ఆ త‌ర్వాత భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేసిన 19వ ఓవ‌ర్ రెండో బంతిని కూడా భారీ షాట్ ఆడే క్ర‌మంలో అభిన‌వ్ మ‌నోహ‌ర్ విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో ఆ బంతి నేరుగా బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠి చేతుల్లోకి వెళ్లింది. కానీ త్రిపాఠి ఆ క్యాచ్‌ను నెల‌పాలు చేయ‌డంతో మ‌నోహ‌ర్ మ‌రోసారి ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నాడు. అప్ప‌టికి త్రిపాఠి స్కోర్ 32 ప‌రుగులుగా ఉంది. ఇక అదే ఓవ‌ర్ నాల్గో బంతిని మ‌నోహ‌రో భారీ షాట్ ఆడే క్ర‌మంలో గాల్లోకి లేపాడు. అయితే ఆ క్యాచ్‌ను ప‌ట్టుకోవ‌డంలో ఈ సారి భువ‌నేశ్వర్ కుమార్ విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో ముచ్చ‌ట‌గా మూడో సారి మ‌నోహ‌ర్ ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. అప్ప‌టికీ మ‌నోహ‌ర్ 33 ర‌న్స్ చేశాడు. ఇది చూసి మ‌నోహ‌ర్‌ను క్యాచ్‌ల ద్వారా ఔట్ చేయ‌డం సాధ్యం కాదేమోన‌ని కామెంటేట‌ర్లు సైతం వ్యాఖ్యానించారంటేనే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. మొత్తానికి 9 బంతుల వ్య‌వ‌ధిలోనే 3 సార్లు మ‌నోహ‌ర్ ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు.

3 సార్లు ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి బ‌య‌టప‌డిన‌ప్ప‌టికీ మ‌నోహ‌ర్ భారీ స్కోర్ చేయ‌లేక‌పోయాడు. మొత్తానికి ఆ త‌ర్వాతే బంతికే మ‌రోసారి భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ త్రిపాఠికి దొరికిపోయాడు. మొత్తానికి 35 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసే స‌మ‌యానికి 7 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసిన గుజారాత్ టైటాన్స్‌.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ముందు 163 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది.

Story first published: Monday, April 11, 2022, 23:26 [IST]
Other articles published on Apr 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+