
గెలుపే లక్ష్యంగా బరిలోకి
సీజన్‌లో ఇరు జట్లకు ఇది నాల్గో మ్యాచ్ కాగా.. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలిచిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. దీంతో టోర్నీలో ఇప్పటివరకు ఓటమెరుగని గుజరాత్ ఈ మ్యాచ్‌లోనూ జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఇక ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడి, ఒక దాంట్లో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరచుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం పట్టుదలగా ఉంది.

మరో 2 వికెట్లు తీస్తే
గుజరాత్ టైటాన్స్ బౌలర్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ ద్వారా ఓ రికార్డును అందుకునేందుకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 98 వికెట్లు తీసిన రషీద్ ఖాన్.. మరో 2 వికెట్లు తీస్తే 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు. ఈ రికార్డును రషీద్ ఖాన్ నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గుజరాత్ టైటాన్స్ ఆడబోయే మ్యాచ్‌లోనే అందుకునే అవకాశం ఉంది.
అదే జరిగితే తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన టీం మీదనే రషీద్ ఖాన్ ఈ రికార్డును అందుకున్నట్లవుతుంది. కాగా ఐపీఎల్‌లో గత సీజన్ వరకు రషీద్ ఖాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కే ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 79 మ్యాచ్‌లాడిన రషీద్ ఖాన్ 20 సగటుతో 98 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 3/7 గా ఉండగా.. ఎకానమీ 6.34గా ఉండడం గమనార్హం.

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఐడెన్ మర్క్రమ్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, సమర్థ్, గ్లెన్ ఫిలిప్స్, విష్ణు వినోద్, ప్రియం గార్గ్, కార్తీక్ త్యాగి, రొమారియో షెపర్డ్, ఫజల్హాక్ ఫరూకీ, అబ్దుల్ సమద్, సౌరభ్ దూబే

గుజరాత్ టైటాన్స్ పూర్తి జట్టు
మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, విజయ్ శంకర్, వరుణ్ ఆరోన్, వృద్ధిమాన్ సాహా, ప్రదీప్ సాంగ్వాన్, గురుకీరత్ సింగ్ మాన్, అల్జారీ జోసెఫ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, రహ్మానుల్లా గుర్బాజ్, డొమినిక్ డ్రేక్స్, యష్ దయాల్, నూర్ అహ్మద్


Click it and Unblock the Notifications












