For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRHకు గట్టి ఎదురుదెబ్బ.. ఆస్పత్రిలో సన్‌రైజర్స్ ప్లేయర్!!

సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా వరుసగా నాలుగో ఓటమిని అందుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‪లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 152 స్కోర్ చేసింది. గుజరాత్ 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మొత్తానికి అన్ని విభాగాల్లోనూ SRH విఫలమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఓ SRH ఆస్పత్రి పాలయ్యాడని తెలిసింది. ఏమైందంటే?

అతడికి అస్వస్థత..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అస్వస్థతకు గురయ్యాడు. అయితే ఈ విషయాన్ని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గుజరాత్‌తో జరిగిన మ్యాచుకు ముందే చెప్పాడు. ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం అతడు అస్పత్రిలో ఉన్నాడని తెలిసింది. అతడికి జ్వరం ఎక్కువగా ఉందని బయట కథనాలు కనిపిస్తున్నాయి. అందుకే హర్షల్ పటేల్ జీటీతో జరిగిన మ్యాచులో ఆడలేదు. ఈ కారణంగా అతడి స్థానంలో కెప్టెన్ కమిన్స్.. ఉనద్కత్‌ను జట్టులోకి తీసుకున్నాడు. అయితే జీటీతో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ మళ్లీ దారుణంగా ఓడింది.

అతడుంటే ఫలితం మరోలా..
దీంతో క్రికెట్ అభిమానులు SRHని విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో హర్షల్ పటేల్ ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. స్లో పిచ్ పై హర్షల్ పటేల్ కీలక బౌలర్ అయ్యే వాడని, అతడు లేకపోవడమే సన్‌రైజర్స్‌ను దెబ్బతీసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అతడు ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు.

ఎడమచేతి వాటం సీమర్ అయితే హర్షల్ పటేల్ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 30.50 యావరేజ్‌తో నాలుగు వికెట్లు తీశాడు. ఈ మెగా ఆక్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉనద్కత్‌ను రూ.కోటికి కొనుగోలు చేసింది. ఇతడు తన ఐపీఎల్ కెరీర్‌లో 105 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు దక్కించుకున్నాడు.

SRH VS GT IPL 2025 Sunrisers Hyderabad Player Harshal Patel hospitalised

ఇకపోతే తాజాగా జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ లో నితీశ్‌ కుమార్‌రెడ్డి (34 బంతుల్లో 31; 3×4) టాప్ ‌స్కోరర్ గా నిలిచాడు‌. ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్ 16.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (43 బంతుల్లో 61 నాటౌట్‌; 9×4), వాషింగ్టన్‌ సుందర్‌ (29 బంతుల్లో 49; 5×4, 2×6), షెఫానీ రూథర్‌ఫర్డ్‌ (16 బంతుల్లో 35 నాటౌట్‌; 6×4. 1×6) పరుగులు చేశారు. షమీ 2, కమిన్స్ ఒక్క వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ 10వ స్థానంలో నిలిచింది.

Story first published: Monday, April 7, 2025, 8:18 [IST]
Other articles published on Apr 7, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+