Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అస్సలు జీర్ణించుకోలేకపోయా - అందుకే సన్‌రైజర్స్‌ను..: సిరాజ్

Mohammed Siraj: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ విజయం సాధించింది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో 7 వికెట్ల తేడాతో గెలిచింది. విజయంలో పేసర్, హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ (4/17) కీలకంగా వ్యవహరించాడు. అలాగే ఐపీఎల్‌లోనే కాకుండా టీ20 క్రికెట్ లోనే తన అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేశాడు. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం తన ప్రదర్శన గురించి మాట్లాడాడు సిరాజ్. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో తనను ఎంపిక చేయకపోవడంపై మరోసారి స్పందించాడు.

దాన్ని అంగీకరించలేకపోయా...
"హోంగ్రౌండ్‌లో ఆడటం అనేది ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. ప్రేక్షకులలో నా కుటుంబసభ్యులు కూడా ఉండటం నన్ను మరింత ఉత్సాహపరిచింది. నేను ఏడేళ్ల పాటు RCBకి ఆడాను. నా బౌలింగ్‌పై, మైండ్‌సెట్‌పై బాగా శ్రమించాను. అది నాకు బాగా పనిచేస్తోంది. ఒక దశలో, ఛాంపియన్స్ ట్రోఫీకి నన్ను సెలెక్ట్ చేయకపోవడాన్ని అంగీకరించలేకపోయాను. కానీ నేను నా ధైర్యాన్ని కోల్పోకుండా ఫిట్‌నెస్, ఆట.. రెండింటిపైనా పని చేశాను. నేను చేసిన తప్పిదాలను గుర్తించి వాటిని సరిచేసుకున్నాను. ఇప్పుడు నా బౌలింగ్‌ను ఆస్వాదిస్తున్నాను. ఒక ప్రొఫెషనల్ ప్లేయర్‌గా భారత జట్టులో ఎప్పుడూ ఉండే నన్ను ఒక్కసారిగా సెలెక్ట్ చేయకపోతే, మెదడులో అనుమానాలు కలుగుతాయి. కానీ నేను నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని, IPL కోసం ఎదురు చూశాను. మీరు ప్రణాళిక చేసుకున్నదాన్ని సరిగ్గా అమలు చేస్తే, మీరే టాప్‌లో ఉంటారు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలిగితే, అది కూడా సహజంగానే జరిగితే, అది ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది." అని సిరాజ్ పేర్కొన్నాడు.

SRH VS GT IPL 2025 Mohammed Siraj says I was not able to digest not picked for Champions Trophy

తెలుగు కుర్రాడు టాప్ స్కోరర్..
ఈ మ్యాచులో సిరాజ్‌ దెబ్బకు మొదట సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులే చేసింది. నితీశ్‌ కుమార్‌రెడ్డి (34 బంతుల్లో 31; 3×4) టాప్ ‌స్కోరర్ గా నిలిచాడు‌. లక్ష్య ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్ 16.4 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సాధించింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (43 బంతుల్లో 61 నాటౌట్‌; 9×4), వాషింగ్టన్‌ సుందర్‌ (29 బంతుల్లో 49; 5×4, 2×6), షెఫానీ రూథర్‌ఫర్డ్‌ (16 బంతుల్లో 35 నాటౌట్‌; 6×4. 1×6) మంచిగా రాణించారు.

Story first published: Monday, April 7, 2025, 7:23 [IST]
Other articles published on Apr 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+