
పవర్‌ప్లేలో 2 వికెట్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు తొలి ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. ఆ ఓవర్లో భువనేశ్వర్ వైడ్ల రూపంలో భారీగా పరుగులు ఇచ్చుకోవడంతో ఏకంగా 17 పరుగులు వచ్చాయి. వైడ్ల రూపంలోనే ఆ ఓవర్లో భువి 11 రన్స్ ఇచ్చాడు. అయితే ఆ తర్వాతి నుంచి సన్‌రైజర్స్ బౌలర్లు కట్టడి చేశారు. మూడో ఓవర్లో శుభ్‌మాన్ గిల్ (7) వికెట్ భువనేశ్వర్, ఆరో ఓవర్లో సాయి సుదర్శన్ (11) వికెట్ నటరాజన్ తీయడంతో గుజరాత్ టైటాన్స్ పవర్ ప్లే ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి సూపర్ క్యాచ్‌తో శుభ్‌మాన్ గిల్ ఫెమిలియన్ చేరాడు. ఆ తర్వాత ఎనిమిదో ఓవర్లో మాథ్యు వేడ్ (19)ను ఉమ్రాన్ మాలిక్ ఔట్ చేయడంతో 8 ఓవర్ల ఆట ముగిసే సమయానికి గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.

104-4
ఈ క్రమంలో డేవిడ్ మిల్లర్‌తో కలిసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకున్నాడు. వీరిద్దరు నాల్గో వికెట్‌కు 40 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 13 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్.. మార్కో జేన్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికీ 14 ఓవర్లలో గుజరాత్ స్కోర్ 104 పరుగులుగా ఉంది. అభినవ్ మనోహర్‌తో కలిసి కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐదో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు.

3 క్యాచ్‌లు మిస్
ఈ క్రమంలో అభినవ్ మనోహర్ ఇచ్చిన 3 క్యాచ్‌లను సన్‌రైజర్స్ ఫీల్డర్లు నెలపాలు చేశారు. 17.2వ ఓవర్లో ఎయిడెన్ మాక్రమ్, 18.2 ఓవర్లో రాహుల్ త్రిపాఠి, 18.4వ ఓవర్లో భువనేశ్వర్.. మనోహర్ క్యాచ్‌లను వదిలేశారు. మొత్తానికి భువి బౌలింగ్‌లో రాహుల్ త్రిపాఠి క్యాచ్ అందుకోవడంతో 154 స్కోర్ వద్ద మనోహర్ (21 బంతుల్లో 35 రన్స్, 5 ఫోర్లు, ఒక సిక్సు) ఔటైయ్యాడు. ఆ తర్వాత చివరి ఓవర్లో రాహుల్ తెవాటియా (6) రనౌటయ్యాడు.

హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ
ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో 5వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 42 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సుతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ డకౌట్ అయ్యాడు. దీంతో 162-7 వద్ద గుజారాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. హార్దిక్ పాండ్యా 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భువి, నటరాజన్ రెండేసి, మార్కో జెనీషన్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో ఏకంగా 22 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications












