Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH VS GT: మాజీ రైజర్సే సన్‌రైజర్స్‌ నడ్డివిరిచింది!!

ఐపీఎల్‌ 2025 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అంటే 300 స్కోరే గుర్తొచ్చేది. ఎందుకంటే ఈ 300 మార్క్ ను టచ్ చేసే సత్తా ఉన్న ఏకైక జట్టు సన్‌రైజర్సే అని క్రికెట్ అభిమానులు గట్టిగా నమ్మారు. గత సీజన్ లోనూ ఆ రేంజ్ ప్రదర్శన కూడా చేశారు. కానీ ఇప్పుడీ సీజన్ లో 5 మ్యాచ్‌ల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తొలి సీజన్ ను ఆరంభంతో ప్రారంభించిన సన్‌రైజర్స్‌.. ఆ తర్వాత వరుసగా నాలుగు ఓటములను ఎదుర్కొని చతికిలపడింది. తాజాగా జరిగిన గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

తెరపైకి ఆసక్తికర చర్చ..
అయితే ఈ ఓటమి తర్వాత ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. తాజాగా (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్‌ను దెబ్బ కొట్టింది గుజరాత్ టైటాన్స్ కాదనే కొత్త చర్చను మొదలుపెట్టారు అభిమానులు. అదేంటి గుజరాత్ పై ఓడిపోతే గుజరాత్ కాదేంటి అంటారా?.. విషయం ఏంటంటే SRHను గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్, హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ (4/17) గట్టి దెబ్బకొట్టాడు. ఐపీఎల్‌లోనే కాదు టీ20 క్రికెట్లో తన అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు. అలానే వాషింగ్టన్ సుందర్ 29 బంతుల్లోనే 190కు పైగా స్ట్రైక్ రేట్‌తో 49 రన్స్‌తో లక్ష్య ఛేదనను సులువుగా మార్చేశాడు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. ఈ ఇద్దరు గతంలో SRHకు ఆడారు.

SRH VS GT Former SRH players Mohammed Siraj and Washington Sundar beat sunrisers hyderabad

మాజీ రైజర్సే..
అందుకే ఇప్పుడు సన్‌రైజర్స్‌ అభిమానులంతా SRHను దెబ్బతీసింది గుజరాత్ కాదని, మాజీ సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు అని కామెంట్లు చేస్తున్నారు. అలానే వీరిద్దరూ మన జట్టులో ఉన్నప్పుడు ఎందుకు ఇలా ఆడలేదంటూ చర్చించుకుంటున్నారు. కాగా, సిరాజ్ 2015-2017 నుంచి సన్‌రైజర్స్‌ తరఫున ఆడాడు. వాషింగ్టన్ సుందర్ 2022-2024 వరకు SRHకు ప్రాతినిధ్యం వహించాడు.

Story first published: Monday, April 7, 2025, 9:14 [IST]
Other articles published on Apr 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+