Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs GT: గుజరాత్ టైటాన్స్‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ విజ‌యానికి 4 ప్ర‌ధాన కార‌ణాలు ఇవే!

SRH vs GT: 4 main reasons for Sunrisers Hyderabads victory over Gujarat Titans

ఐపీఎల్ 2022లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. కెప్టెన్‌ కేన్ విలియమ్స‌న్ (57) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగడానికి తోడు అభిషేక్ శ‌ర్మ (42), నికోల‌స్ పూర‌న్ (34*) రాణించ‌డంతో గుజరాత్ టైటాన్స్‌పై స‌న్స్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 8 వికెట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో టోర్నీలో గుజ‌రాత్ టైటాన్స్‌కు తొలి ఓట‌మి ఎదురైంది.

అంతేకాకుండా ఆ జట్టు హ్యాట్రిక్ విజయాలకు కూడా బ్రేక్ పడింది. అంత‌కుముందు బౌల‌ర్లు క‌లిసిక‌ట్టుగా రాణించ‌డ‌తో గుజ‌రాత్ టైటాన్స్‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 162-7కే క‌ట్ట‌డి చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఘ‌న‌విజ‌యం సాధించ‌డానికి 4 విష‌యాలు ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు.

బ్యాలెన్సింగ్ బౌలింగ్‌

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన మొద‌టి అంశం బౌల‌ర్లంతా స‌మిష్టిగా రాణించ‌డ‌మ‌నే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్ బౌల‌ర్లంతా మంచి స‌మ‌తుల్యంతో బౌలింగ్ చేశారు. వెట‌ర‌న్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ తొలి ఓవ‌ర్లో భారీగా ప‌రుగులు ఇచ్చిన‌ప్ప‌టికీ త‌న రెండో ఓవ‌ర్లోనే కీల‌క‌మైన శుభ్‌మాన్ గిల్ (7) వికెట్ సాధించాడు.

ఆరో ఓవ‌ర్లో సాయి సుద‌ర్శ‌న్‌(11)ను న‌ట‌రాజ‌న్ ఫెమిలియ‌న్ చేర్చ‌డంతో ప‌వ‌ర్‌ప్లేలోనే రెండు వికెట్లు సాధించిన స‌న్‌రైజ‌ర్స్ ప‌ట్టుబిగించింది. ఆ త‌ర్వాత 8వ ఓవ‌ర్లో వేడ్ (19)ను ఉమ్రాన్ మాలిక్, 14వ ఓవ‌ర్లో మిల్ల‌ర్ (12)ను మార్కో జెనీష‌న్ ఫెమిలియ‌న్ చేర్చాడు. ఇక కీల‌కమైన చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో భువి, న‌ట‌రాజ‌న్ 14 ప‌రుగులే ఇచ్చి అభిన‌వ్ మ‌నోహ‌ర్ (35), రాహుల్ తెవాటియా (6), ర‌షీద్ ఖాన్‌(0)ను ఫెమిలియ‌న్ చేర్చారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో భువి, న‌ట‌రాజ‌న్ రెండేసి, ఉమ్రాన్ మాలిక్, మార్కో జేనీష‌న్ త‌లో వికెట్ తీశారు.

జ‌ట్టుగా బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌

ఇక బ్యాటింగ్‌లోనూ స‌న్‌రైజ‌ర్స్ ఆట‌గాళ్లంతా ఈ మ్యాచ్‌లో రాణించారు. 163 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌తో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్‌కు ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, కేన్ విలియ‌మ్స‌న్ 64 పరుగుల‌తో శుభారంభాన్ని ఇచ్చారు. అనంత‌రం అభిషేక్ (42) ఔటైనప్ప‌టికీ రాహుల్ త్రిపాఠి, నికోల‌స్ పూర‌న్‌తో క‌లిసి విలియ‌మ్స‌న్ మంచి భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో త్రిపాఠి (17) రిటైర్డ్ హార్ట్‌, విలియమ్స‌న్ (57) ఔట‌య్యారు. అనంత‌రం పూర‌న్ చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిలిచి ఎయిడెన్ మాక్ర‌మ్‌తో క‌లిసి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు.

హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగిన కేన్ మామ‌

ఆరంభ మ్యాచ్‌ల్లో పెద‌గా రాణించిన కెప్టెన్ కేన్ విలియమ్స‌న్ హాఫ్ సెంచ‌రీతో ఫామ్‌లోకి రావ‌డం ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్‌కు అతిపెద్ద బ‌లంగా చెప్పుకోవ‌చ్చు. ఆరంభంలో స్లోగా ఆడిన‌ప్ప‌టికీ క్రీజులో కుదురుకున్నాక విలియ‌మ్స‌న్ స్కోర్ బోర్డున ప‌రుగులు పెట్టించాడు. ఈ క్ర‌మంలో అభిషేక్ శ‌ర్మ‌తో తొలి వికెట్‌కు 64, రెండో వికెట్‌కు 65 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాల‌ను నెలకొల్పాడు. 17వ ఓవ‌ర్లో ఔటైన‌ప్ప‌టికీ అప్ప‌టికే స‌న్‌రైజ‌ర్స్‌ను విజ‌యానికి చేరువ చేశాడు.

ఫామ్‌లోకి పూర‌న్

స‌న్‌రైజ‌ర్స్ బిగ్ హిట్ట‌ర్ నికోల‌స్ పూర‌న్ ఫామ్‌లోకి రావ‌డం కూడా జ‌ట్టుకు బ‌లంగా మారింది. 2 ఫోర్లు, 2 సిక్సుల‌తో 18 బంతుల్లోనే అజేయంగా 34 పరుగులు చేసి ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చాడు. చివ‌రి ఓవ‌ర్ తొలి బంతినే సిక్సు కొట్టి జ‌ట్టుకు 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందించాడు. కాగా త‌ర్వాతి మ్యాచ్‌ల్లోనూ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇదే ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రిస్తే టోర్నీలో జట్టుకు తిరుగుండ‌ద‌ని చెప్పుకోవాలి.

Story first published: Tuesday, April 12, 2022, 7:24 [IST]
Other articles published on Apr 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+