న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs DC: ఆ సమయంలో బెయిర్‌స్టో టాయిలెట్లో ఉన్నాడా?.. సెహ్వాగ్‌ సెటైర్!!

SRH vs DC: Virender Sehwag questions if Jonny Bairstow was in toilet for not batting in Super Over

ఢిల్లీ: చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ సీజన్‌లో తొలి సూపర్‌ ఓవర్‌ నమోదైన సంగతి తెలిసిందే. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా.. హైదరాబాద్ సైతం 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయ్యింది. దీంతో సూపర్‌ ఓవర్ నిర్వహించారు. సూపర్‌ ఓవర్లో హైదరాబాద్‌ 7 పరుగులు చేయగా.. ఢిల్లీ 8 పరుగులు చేసి గెలుపొందింది. ఈ మ్యాచులో సన్‌రైజర్స్‌ అనుసరించిన వ్యూహాలపై క్రీడా విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. చివరి దాకా పోరాడి కూడా స్వీయ తప్పిదాల వల్ల మ్యాచ్‌ను చేజార్చుకుందంటూ విమర్శిస్తున్నారు.

సూపర్‌ ఓవర్‌లో జానీ బెయిర్‌స్టోను ఆడించకపోవడంపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ... 'లక్ష్య ఛేదనలో జానీ బెయిర్‌స్టో 18 బంతుల్లో 38 పరుగులు చేశాడు. తన హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. సూపర్‌ ఓవర్‌ జరుగుతున్న సమయంలో.. ఒకవేళ బెయిర్‌స్టో టాయిలెట్‌లో ఉండి ఉంటే తప్ప, అతడిని ఎందుకు ఆడించలేదో అర్థం కావడం లేదు. హైదరాబాద్‌ పోరాట పటిమ కనబరిచింది. కానీ వింతైన, అనూహ్య నిర్ణయాల కారణంగా వారిని వారు నిందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది' అని సెహ్వాగ్‌ సెటైర్ వేశాడు.

PBKS vs KKR: మోడీ మైదానంలోనైనా కోల్‌కతా రాత మారేనా?.. కింగ్స్‌ మరో విజయం సాధించేనా? తుది జట్లు ఇవే!PBKS vs KKR: మోడీ మైదానంలోనైనా కోల్‌కతా రాత మారేనా?.. కింగ్స్‌ మరో విజయం సాధించేనా? తుది జట్లు ఇవే!

ఇంగ్లండ్‌మాజీ ఓపెనర్‌ నిక్‌ కాంప్టన్‌ కూడా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ప్రపంచంలోని ప్రస్తుత బెస్ట్‌ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడైన జానీ బెయిర్‌స్టో సూపర్‌ ఓవర్‌లో ఎందుకు బ్యాటింగ్‌ చేయలేదు అని ప్రశ్నించాడు. వీరు మాత్రమే కాదు.. మరికొందరు మాజీలు సైతం వార్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇక నెటిజన్లు సైతం సెహ్వాగ్‌ అభిప్రాయాన్ని సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అప్పటికే అలసిపోయిన విలియమ్సన్‌ బదులు బెయిర్‌స్టోను పంపించి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. వార్నర్ కాకుండా బెయిర్‌స్టో బరిలోకి దిగితే బాగుండని అంటున్నారు.

సూపర్ ఓవర్ సాగిందిలా:

సన్ రైజర్స్ బ్యాటింగ్:

బాల్ 1: అక్షర్ x వార్నర్ - నో రన్

బాల్ 2: అక్షర్ x వార్నర్ - 1 రన్

బాల్ 3: అక్షర్ x విలియమ్సన్ - ఫోర్

బాల్ 4: అక్షర్ x విలియమ్సన్ - నో రన్

బాల్ 5: అక్షర్ x విలియమ్సన్ - 1 లెగ్ బై

బాల్ 6: అక్షర్ x విలియమ్సన్ - 1 రన్

ఢిల్లీ బ్యాటింగ్:

బాల్ 1: రషీద్ ఖాన్ x పంత్ - 1 రన్

బాల్ 2: రషీద్ ఖాన్ x ధవన్ - 1 లెగ్ బై

బాల్ 3: రషీద్ ఖాన్ x పంత్ - ఫోర్

బాల్ 4: రషీద్ ఖాన్ x పంత్ - నో రన్

బాల్ 5: రషీద్ ఖాన్ x పంత్ - 1 లెగ్ బై

బాల్ 6: రషీద్ ఖాన్ x ధవన్ - 1 లెగ్ బై

Story first published: Monday, April 26, 2021, 14:55 [IST]
Other articles published on Apr 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X