న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs DC: ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్ బాల్స్.. టాప్‌లో సన్‌రైజర్స్ బౌలర్!!

SRH vs DC: Rashid Khan bowls most dot balls in an innings in IPL 2020
SRH vs DC : Rashid Khan's Magical Best IPL Spell 3/7 | Most Economical Spell Of IPL 2020 || Oneindia

దుబాయ్: ఐపీఎల్ 2020‌లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 88 పరుగులతో తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ సంచలనం, సన్‌రైజర్స్ బౌలర్ రషీద్‌ ఖాన్‌ అద్భుతమైన స్పెల్‌తో అదరగొట్టాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లును నేలకూల్చాడు. షిమ్రాన్ హెట్‌మెయిర్‌ను బౌల్డ్‌ చేసిన రషీద్‌.. అజింక్య రహానేను ఎల్బీగా ఔట్‌ చేశాడు. అక్షర్‌ పటేల్‌‌ను క్యాచ్‌గా ఔట్ చేసి మరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్ 17 డాట్ బాల్స్ వేశాడు. దీంతో ఐపీఎల్ 2020‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చహార్ కూడా ఒక ఇన్నింగ్స్‌లో 17 డాట్ బాల్స్ వేసి వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. చెన్నైతో జరిగిన మ్యాచులో బౌల్ట్.. 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

రాజస్థాన్ మ్యాచులో 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు చహర్. బెంగళూరు పేసర్ మొహ్మద్ సిరాజ్ 16 డాట్ బాల్స్ వేసి నాలుగో స్థానంలో ఉన్నాడు. వీరి తర్వాత రషీద్ 16 డాట్ బాల్స్ వేశాడు. టాప్-5లో రషీద్ రెండు స్థానాల్లో ఉన్నాడు.

రషీద్‌ ఖాన్ ఈ ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో బెస్ట్‌ బౌలింగ్‌ గణాంకాలను (3/7) కూడా నమోదు చేశాడు. అంతేకాకుండా ఒక మ్యాచులో అత్యుత్తమ ఎకానమీని (1.91) తన పేరుపై లిఖించాడు. ఈ ఐపీఎల్‌లో అత్యుత్తమ ఎకానమీని (1.91) నమోదు చేసిన రషీద్‌.. టోర్నీ చరిత్రలో ఆరో ‌స్థానంలో ఉన్నాడు. ఆశిష్ నెహ్రా (1/6, 2009), ఫిడేల్ ఎడ్వర్డ్స్ (0/6, 2009), యుజ్వేంద్ర చహల్ (1/6, 2019), రాహుల్ శర్మ (2/7I, 2011), లాకీ ఫెర్గూసన్ (2/7, 2017)లు రషీద్‌ కంటే ముందున్నారు.

ఐపీఎల్ 2020లో ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లాడిన రషీద్‌ ఖాన్‌ మొత్తం 17 వికెట్లను సాధించగా.. ఎకానమీ 5.00గా ఉంది. 48 ఓవర్ల బౌలింగ్‌ వేసిన రషీద్‌.. 240 పరుగులు ఇచ్చాడు. ఓవర్‌కు ఎకానమీ 5.00గా నమోదైంది. ఇదే ఈ సీజన్‌లో ఇప్పటివరకూ అత్యుత్తమ ఎకానమీ. ఈ క్రమంలోనే ఎకానమీలో ఆర్సీబీ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను రషీద్ వెనక్కినెట్టాడు. సుందర్‌ ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లాడి 5.72 ఎకానమీతో ఉన్నాడు. సుందర్‌ 37 ఓవర్లు వేసి 212 పరుగులిచ్చాడు.

SRH vs DC: సన్‌రైజర్స్‌ ఆటగాళ్ల కేక్‌ ఫైట్‌.. అస్సలు మిస్పవకండి (వీడియో)SRH vs DC: సన్‌రైజర్స్‌ ఆటగాళ్ల కేక్‌ ఫైట్‌.. అస్సలు మిస్పవకండి (వీడియో)

Story first published: Wednesday, October 28, 2020, 16:15 [IST]
Other articles published on Oct 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X