Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీకి హ్యాట్రిక్‌ విజయం.. సొంతగడ్డపై హైదరాబాద్‌ ఓటమి

IPL 2019 : Delhi Capitals Beat Sunrisers Hyderabad By 39 Runs || Oneindia Telugu
SRH vs DC IPL: Kagiso Rabada, Chris Morris Star As Delhi Capitals Beat SunRisers Hyderabad By 39 Runs

ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 39 పరుగుల తేడాతో రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. తాజా విజయంతో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసింది. దీంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండవ స్థానంకు చేరుకుంది. మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఓటముల్లో హ్యాట్రిక్‌ కొట్టి పాయింట్ల పట్టికలో దిగువ నుంచి మూడో స్థానంలో ఉంది.

ఆరంభం అదిరింది:

ఆరంభం అదిరింది:

156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు మంచి ఆరంభమే లభించింది. రబడ ఓవర్లో బెయిర్‌స్టో, వార్నర్‌లు చెరో ఫోర్‌ కొట్టారు. ఇషాంత్‌ వేసిన తర్వాతి ఓవర్లో బెయిర్‌స్టో మరో రెండు ఫోర్లు బాదాడు. పవర్‌ప్లే ముగిసే సరికి సన్‌రైజర్స్‌ స్కోరు 40 పరుగులకు చేరింది. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 59 బంతుల్లో 72 పరుగులు జోడించారు.

 రబాడ సూపర్ షో:

రబాడ సూపర్ షో:

అనంతరం ఢిల్లీ బౌలర్ పాల్‌ విజృంభించి వరుస ఓవర్లలో బెయిర్‌స్టో (41; 31 బంతుల్లో 5×4, 1×6), విలియమ్సన్‌ (3)లను ఔట్‌ చేశాడు. వీరిద్దరి క్యాచ్‌లను రబాడ అందుకున్నాడు. ఇక తొలి మ్యాచ్‌ ఆడుతున్న రికీ భుయ్‌ (7) దారుణంగా విఫలమయ్యాడు. ఈ సమయంలో పరుగులు రావడం కష్టంగా మారింది.

క్రిస్ మోరిస్, రబడ విజృంభణ:

క్రిస్ మోరిస్, రబడ విజృంభణ:

క్రీజులో ఉన్న డేవిడ్‌ వార్నర్‌ (51; 47 బంతుల్లో 3×4, 1×6) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటవెంటనే వార్నర్‌, విజయ్‌ శంకర్‌ (1)ను రబడ ఔట్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రిస్ మోరిస్, రబడ దాటికి వచ్చిన వారు వచ్చినట్టు పెవిలియన్ చేరడంతో.. సన్‌రైజర్స్‌ 18.5 ఓవర్లలో ఆలౌట్ అయింది. దిల్లీ పేసర్లు రబాడ (4/22), కీమో పాల్‌ (3/17), మోరిస్‌ (3/22) వికెట్లు తీశారు.

ఆదుకున్న అయ్యర్‌:

ఆదుకున్న అయ్యర్‌:

తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ ఇన్నింగ్స్ ఆరంభంలో ఇబ్బంది పడ్డారు. పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ ఓపెనర్లు పృథ్వీ షా (4), శిఖర్‌ ధావన్‌ (7)లను అవుట్ చేసాడు. 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన డిల్లీని కోలిన్ మన్రో (40; 24 బంతుల్లో 4×4, 3×6), కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (45; 40 బంతుల్లో 5×4) ఆదుకున్నారు. మరో వికెట్‌ పడకుండా జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు.

మన్రో దాడి:

మన్రో దాడి:

క్రీజులో కుదురుకున్నాక మన్రో (40) భారీ షాట్లు ఆడుతూ స్కోర్ వేగం పెంచాడు. మన్రో అవుట్ అయ్యాక.. శ్రేయస్‌కు పంత్‌ (23; 19 బంతుల్లో 3×4) జత కలిశాడు. 15 ఓవర్లలో 121/3తో పటిష్ట స్థితిలో నిలిచిన డిల్లీ.. చివరి ఓవర్లలో సన్‌రైజర్స్‌ బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది. మోరిస్‌ (4), పాల్‌ (7)లు కూడా పరుగులు చేయలేదు. ఇన్నింగ్స్ చివరలో అక్షర్‌ పటేల్‌ (14 నాటౌట) డిల్లీ స్కోరును 150 పరుగులు దాటించాడు. కీమో పాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Story first published: Monday, April 15, 2019, 7:38 [IST]
Other articles published on Apr 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+