Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH VS DC: జేక్‌ ఫ్రేజర్‌‌ను గట్టి క్లాస్ పీకిన కెవిన్ పీటర్సన్ - అందరి ముందే!!

SRH VS DC: ఐపీఎల్‌ 2025లో దిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతోంది. వైజాగ్‌ను తన రెండో సొంత మైదానంగా ఎంచుకున్న ఈ జట్టు.. అక్కడ ఆడిన 2 మ్యాచుల్లోనూ విజయాలను అందుకుంది. తాజాగా ఆదివారం(మార్చి 31) జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచులో జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ బ్యాట్ తో పాటు ఫీల్డింగ్ లోనూ మెరిశాడు. అయితే మ్యాచు సమయంలో జేక్ ఫ్రేజర్‌‌ను దిల్లీ క్యాపిటల్స్ మెంటార్ కెవిన్ పీటర్సన్ గట్టిగా అరవడం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

ఎందుకు క్లాస్ పీకాడంటే?
మొదట బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్‌ 18.4 ఓవర్లలో 163 పరుగులకే కుప్పకూలింది. దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ (5/35) ఆ జట్టును గట్టిగా దెబ్బకొట్టాడు. అయితే సన్‌రైజర్స్‌ ఆ మాత్రం స్కోర్ అయినా చేసిందంటే.. దాని కారణం అనికేత్‌వర్మ (74; 41 బంతుల్లో 5×4, 6×6). కానీ చక్కగా ఆడుతున్నా అనికేత్‌ ఇన్నింగ్స్‌కు .. డీప్‌ మిడ్‌వికెట్లో గాల్లోకి ఎగిరి మరీ కళ్లు చెదిరే క్యాచ్‌తో తెరదించాడు దిల్లీ ఆటగాడు మెక్‌గుర్క్‌. ఆ తర్వాత ఛేదనలోనూ మెక్‌గుర్క్‌ (38; 32 బంతుల్లో 4×4, 2×6) చెలరేగడంతో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ అలవోకగా ఛేదించింది.

SRH VS DC Kevin Pietersen gave some tips to Jake Fraser Mcgurk on field goes viral
Photo Credit: twitter screenshot

కొన్ని టిప్స్ కూడా..
అయితే మెక్‌గుర్క్‌ మంచిగానే బ్యాటింగ్ చేసినప్పటికీ కాస్త తడబడినట్లు అనిపించింది. పవర్ ప్లేలో పిచ్ పేస్ పై ఇబ్బంది పడ్డాడు.దీంతో డ్రింక్స్ బ్రేక్ లో వచ్చిన మెక్ ను దిల్లీ జట్టు మెంటార్ కెవిన్ పీటర్సన్ కాస్త మందలించాడు. మెక్‌గుర్క్‌ పై కాస్త అరిచాడు! ఆటకు సంబంధించి కొన్ని టిప్స్ కూడా చెప్పాడు. వాస్తవంగా చెప్పాలంటే కాస్త గట్టిగానే క్లాస్ పీకాడు. అయితే ఇది కాస్త అందరి కంట పడింది. అదే సమయంలో కామెంటేటరీ బాక్సులో ఉన్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. దీనిపై స్పందించి తప్పుబట్టాడు.

Story first published: Monday, March 31, 2025, 12:13 [IST]
Other articles published on Mar 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+