Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH VS DC: కన్నెర్రజేసిన స్టార్క్! - తలదించుకున్న కేఎల్ రాహుల్!! (వీడియో వైరల్)

SRH VS DC: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా విశాఖపట్నం వేదికగా జరుగుతోన్న మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ దిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. అయితే ఆరెంజ్ ఆర్మీకి ఈ మ్యాచు కూడా కలిసొచ్చే అవకాశం కనపడట్లేదు. దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ స్టార్క్ .. హైదరాబాద్ బ్యాటర్లకు యముడిగా మారాడు. ఆన్ ఫైర్‌లో ఉన్న అతడు.. వెంట వెంటనే హైదరాబాద్ జ్టటు వికెట్లను పడగొట్టాడు.

మొదటగా తొలి ఓవర్ లో ఐదో బంతికి సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ (1) రనౌట్ గా వెనుదిరగగా..ఆ తర్వాత మూడు వికెట్లను స్టార్క్ (Mitchell Starc) పెవిలియన్ కు పంపాడు. 2.1 ఓవర్ దగ్గర మిచెల్ స్టార్క్ బౌలింగ్ స్టబ్స్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ఇషాన్ కిషన్ (2). అనంతరం మిచెల్ స్టార్క్ లో బౌలింగ్ లోనే నితీశ్ కుమార్ రెడ్డి డకౌట్ గా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కాస్త జాగ్రత్తగా ఆడిన ట్రావిస్ హెడ్ (22).. 4.1 ఓవర్ దగ్గర స్టార్క్ బౌలింగ్ లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అలా మిచెల్ స్టార్.. దిల్లీ క్యాపిటల్స్ పై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకు పడి వికెట్లు తీశాడు.

SRH VS DC IPL 2025 Mitchell Starc Irriated and KL Rahul head Down for catch miss
Photo Credit: twitter screenshot

స్టార్క్ అసహనం - తలదించుకున్న రాహుల్!!
అయితే కేఎల్ రాహుల్ కు మొదటగా స్టార్క్ బౌలింగ్ లో ఆడిన నితీశ్ కుమార్ రెడ్డిని ఔట్ చేసే అవకాశం వచ్చింది. మూడో ఓవర్ లో నితీశ్ బంతిని బాదగా అది కాస్త గాల్లోకి ఎగిరి వికెట్ కీప్ రాహుల్ చేతిలోకి వెళ్లబోయింది. అయితే బంతి మొదట కుడి వైపు వెళ్లింది. దీంతో రాహుల్ దాని కోసం జరగగా, అంతలోనే బంతి మలుపు తిరిగి ఎడమవైపునకు వెళ్లింది. దీంతో రాహుల్ క్యాచ్ మిస్ అయ్యాడు. అప్పుడు స్టార్క్ అసహనంతో రాహుల్ వైపు చూశాడు. దీంతో రాహుల్ కూడా క్యాచ్ మిస్ చేసిన బాధతో నిరాశగా తలదించుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా, ఈ ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్.. 18.4 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటైంది. అనికేత్ వర్మ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రావిస్ హెడ్ (22) రన్స్ చేశారు. దిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు. కుల్‌దీప్ యాదవ్ 3, మోహిత్ శర్మ ఒక వికెట్ తీశారు.

Story first published: Sunday, March 30, 2025, 17:12 [IST]
Other articles published on Mar 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+